Others

నాన్న పగమీద అతిప్రేమతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్‌సింగ్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ఆశిష్ విద్యార్థి, మధుబాల తదితరులు
సంగీతం:
దేశీశ్రీ ప్రసాద్
నిర్మాత:
బివిఎస్‌ఎన్ ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
సుకుమార్

‘పెయింటింగ్ విలువ పాతిక్కోట్లు’ కావొచ్చు. దాన్ని గోడమీద నిలబెట్టడానికి -పావలా మేకుండాలి. ‘సినిమా ఖర్చు 50 కోట్లు’ దాటొచ్చు. ప్రేక్షకుడికి రుచించాలంటే -ప్రేమో, పగో పండాలి. లేదంటే వండాలి. ఆ ప్రయత్నాన్ని ప్రూవ్డ్ హీరో ఎన్టీఆర్, ప్రూవ్డ్ డైరెక్టర్ సుకుమార్‌లు సంయుక్తంగా ఎలా చేశారో -చూద్దాం.
***
బాస్‌దగ్గర తిన్న చివాట్ల చిరాకు పబ్లిక్‌పై చూపించే సన్నివేశంతో పరిచయమవుతాడు -హీరో అభిరామ్ (జూ. ఎన్టీఆర్). ఉద్యోగం ఊడిన తనలాంటి చి(గు)రాకు నిరుద్యోగుల్ని కలబోసి -కెఎంసి కంపెనీకి ఊపిరిపోస్తాడు. అదే టైంలో తండ్రి సుబ్రహ్మణ్యం (రాజేంద్రప్రసాద్) అనారోగ్య సమాచారం అందుతుంది. నాన్నను చూసేందుకు అన్న (రాజీవ్ కనకాల) ఇంటికొస్తాడు. అప్పటి వరకూ తండ్రి పెదాలపై చిర్నవ్వే చూసిన అభికి, ఆయన పంటి బిగువున బాధ కళ్లలో నీళ్లై కనిపిస్తుంది. అందుక్కారణం -ఒకనాటి మిత్రుడు, ప్రస్తుత కోటీశ్వరుడు కృష్ణమూర్తి కౌటిల్య (జగపతిబాబు) అని తెలుస్తుంది. గతంలో కోటీశ్వరుడైన రమేష్ చంద్రప్రసాద్ వర్తమానంలో పేరు మార్చుకుని సుబ్రహ్మణ్యంగా బతకాల్సిన దుస్థితికి కౌటిల్యే కారణమని అర్థమవుతుంది. మోసం చేసిన మిత్రుడిని నాశనం చేస్తేనే -నాన్న కళ్లలో ఆనందం చూడగలనని హీరోకు టాస్క్ ఫిక్సవుతుంది. అలా ఆపరేషన్ కెఎంసి ఆరంభమవుతుంది. కరుడుగట్టిన కృష్ణమూర్తిని దెబ్బకొట్టడానికి కూతురు దివ్యాంక (రకుల్ ప్రీత్‌సింగ్)తో మైండ్‌గేమ్ స్టార్ట్ చేస్తాడు హీరో. కృష్ణమూర్తి, అభిరామ్‌ల మధ్య ఎత్తుకు పైఎత్తులు సాగుతాయి. అల్టిమేట్ గేమ్‌లో అభిరామ్ ఎలా విన్నయ్యాడన్నదే అసలు కథ.
***
అసందర్భమే అయినా ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. మహాభారతంలో రాజ్యాన్ని ఫణంపెట్టి సాగించిన జూదఘట్టం తరువాత ద్రౌపదికి ఓ ప్రశ్న ఉద్భవిస్తుంది. ధర్మరాజు -తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా? అని. ఈ కథను చూస్తున్న ప్రేక్షకుడినీ ఓ ప్రశ్న వెంటాడుతుంది. హీరో అభి -నాన్నను ప్రేమిస్తున్నాడా? నాన్న పగను ప్రేమిస్తున్నాడా? అని. ప్రేమా? పగ కలగలిపి చేసిన ఎమోషనల్ ఫ్యూజన్‌లో కన్ఫ్యూజన్‌దే పైచేయి అయ్యింది. ఆ కన్ఫ్యూజనే హీరో క్యారేక్టరైజేషన్‌కి ఉన్న క్లారిటీని మిస్ చేసింది. తండ్రి పగను ప్రేమించిన హీరో, విలన్‌ను నాశనం చేయడానికి కూతురి ప్రేమను వాడుకోవడం మరో మిస్‌ఫైర్. మరోపక్క దివ్యాంక అటెన్షన్ కోసం అద్భుతమైన మైండ్ గేమ్, యాక్ట్-ఇంపాక్ట్ మాథమెటికల్ కాలిక్యులేషన్స్ ప్రదర్శించిన హీరో -విలన్ మూమెంట్స్‌ను ఏమాత్రం పసిగట్టలేకపోతాడు. ఇదే హీరోయిజంలోని ‘సటిల్డ్‌నెస్, స్టెబిలిటీ’ గ్రాఫ్‌ను దించేసింది.
ఇక సినిమాను హీరో ఎన్టీఆర్ వన్‌మేన్ షో చేసేశాడు. విడుదలకు ముందు మేకోవర్‌తో ఆసక్తిని రేపిన తారక్, క్లైమాక్స్‌లోని 45 నిమిషాలు షో రక్తికట్టించాడు. అయితే, క్యారెక్టర్‌కు తగ్గ మేకోవరే తప్ప -స్టోరీకి దాన్ని అసెట్‌గా మలచలేకపోయారు. అప్పియరెన్స్, డైలాగ్ డెలివరీ, బాడీలాంగ్వేజ్, బాగా తెలిసిన డాన్స్‌లో జూ.ఎన్టీఆర్ శ్రమ కనిపించింది. రకుల్ గ్లామర్ సినిమాకు ఒకింత ప్లస్. డబ్బింగ్ ప్రయత్నం కూడా ఓకే. కానీ, తారక్, రకుల్ మధ్య కెమిస్ట్రీ మాత్రం మైనస్. ఎక్స్‌పెక్టేషన్స్ లేవుకనుక -విలన్‌గా జగపతిబాబు బెస్ట్ చాయిస్. అలవాటైన పాత్రల్లో రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ఆశిష్ విద్యార్థిలాంటి వాళ్లు ఓకే.
సాంకేతికంగా..
దేవిశ్రీ బాణీలు బావున్నాయి. ముఖ్యంగా విదేశీ లొకేషన్లను అందంగా చూపించడంలో విజయ్ సి చక్రవర్తి సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ -సబ్జెక్టుకు క్లారిటీ ఇవ్వలేకపోయింది. కొరియోగ్రఫీ ఓకే. భారీ బడ్జెట్ కనుక స్క్రీన్‌పై రిచ్‌నెస్ కనిపించింది. దర్శకుడిగా సుకుమార్ చూపించిన హైప(వ)ర్ ఇంటెలిజెన్సీ -హయ్యర్ స్టేజ్‌కు మాత్రం తీసుకెళ్లలేదు.