Others

నడుస్తున్న భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావాలకు రూపంగా
మనుషులు జీవించే జాడ
ఎంత వెతికినా కనపడని
పొద్దుపొడుపు నీడ
దార్శనికుల ప్రస్తావన అవసరమనిపించినా
మేధోమథనం సులభగ్రాహ్యమవునా..

గుండెను వెముకలు కొవ్వు కండరాలు
లోలోపల మూసేస్తూనే ఉన్నాయ్
కనపడేది మనసున్న మానవ హృదయానికే
లయబద్ధమైన రెండు గుహాంతర వాయద్యాలు
అరుదుగా కాని వినపడవు...
ఆటోడ్రైవర్‌నుంచి విమాన చోదకుడి వరకూ
సాంత్వన కోసం వెంపర్లాట
నిరాశను కప్పిపుచ్చుకునేందుకు
అతికించిన చిరునవ్వులు..
శతాధిక వందనాలు
సత్యానికి శాశ్వతత్వం లేకపోతే
అబద్ధాలు రాజ్యాలేలుతాయ
మంచినంతా ఒకచోట పేర్చి
చెడునంతా ఒకచోట చేర్చి
ఏది కావాలో తీసుకోమంటే
సంకోచించే కాలం...
నిస్సందేహంగా ఆలోచనలకు వేసిన గాలం
సౌమ్యంగా మాట్లాడక
రమ్యంగా జీవించక
మస్తిష్క గగనాన
ఆనంద విహారం చేయక
ఆశించిన ఆర్ద్రతలో
తడి ఏమాత్రం సోకక
చేయ కలిపినా స్పర్శ తెలియక
సాగుతున్నది జీవిత విధం
విస్తరించిన వర్తమాన పథం

- డా. భండారు ఉమామహేశ్వరరావు, 9989842567