Others

కారులో షికారు చేస్తే గుండెకు చేటు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారులో షికారు చేద్దామనుకుంటే తస్మాత్ జాగ్రత్తా అని అంటున్నారు పరిశోధకులు. చేతిలో కారుంటే చాలు కుర్రకారు అమ్మాయిలతో వేల మైళ్లు ప్రయాణించటానికి వెనుకాడరు. ఎక్కువ సమయం కారు డ్రైవింగ్‌లో గడపాలనుకుంటే మాత్రం గుండె సమస్యలకు దగ్గరవుతారంటా! ఆస్ట్రేలియాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, క్యాథలిక్ యూనివర్శిటీ చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. వీరు దాదాపు రెండు వేల మందిపై పరిశోధనలు చేశారు. 34 నుంచి 65 సంవత్సరాలు లోపు ఉన్నవారిపై ఈ పరిశోధనలు జరిగాయి. వీరి కారు డ్రైవింగ్‌లో గడిపే కాలాన్ని, శారీరక చురుకుదనం, మద్యం సేవించటం, వీరి సామాజిక, ఆర్థిక సమస్యలను సైతం పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు చేశారు. వీరంతా సగటున 2.3 కిలోమీటర్ల దూరం, 15 నిమిషాల కన్నా తక్కువ సమయంలో కారు నడపారు. ఈ కొంచెం దూరం కారు డ్రైవింగ్ చేసినవారిలోనే గుండె సమస్యలు తలెత్తినట్లు కనుగొన్నారు. మరి కారుబాబులూ కాస్త జాగ్రత్తగా కారు నడపండి మరి!

**
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03