Others

అక్కడ టీచర్లు ‘జీన్స్’ ధరించరాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్యానా రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల అధ్యాపికలకు జీన్స్ వేసుకుని క్లాసులకు వస్తే వూరుకోరు. ‘‘మామూలు దుస్తులు చీరలో, షర్ట్ షల్వార్‌లో ధరించి చిన్న పిల్లలికి పాఠాలు చెప్పాలి. అంతేకాని, పిల్లలు బ్లాక్‌బోర్డువైపు చూడకుండా, మీ ‘వీపుల’వైపే చూస్తూ కూర్చుండిపోతారు. కనుక జీన్స్‌ని ఇంట్లో పెట్టేయండి’’ అంటూ హర్యానా రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖాధికారి ఉత్తర్వు జారీ చేస్తూ డి.ఇ.ఓ.లు ఈ విషయంలో తనిఖీ చేస్తూ వుండాలని కూడా ఆదేశాలు జోడించారు.
అంతేనా? విద్యాశాఖ కార్యాలయాలకి, అధికార నిలయాలకీ- జీన్స్ తొడుక్కుని- ఆడా మగా టీచర్లు ఏదయినా పనిమీద రావడం కూడా తప్పేనన్నారు. దీనిమీద కాంగ్రెస్ పార్టీకి చెందిన సంఘాలు, ఇతర ఉపాధ్యాయ సంఘాలూ నిరసన తెలిపాయి.
మన దేశం యిలా వుందా?- బ్రిటన్‌లో ఓ ఎనభై స్కూళ్లు ‘లింగవివక్ష’ను ఎత్తేశాయి. ‘‘మగ పిల్లలు, ఆడపిల్లల యూనిఫామ్- ఆడపిల్లలు మగపిల్లాడి యూనిఫాం ధరించి స్కూళ్లకి రావొచ్చును- అని ప్రాథమిక విద్యవరకు డ్రెస్‌కోడ్‌ను ఎత్తేస్తున్నారు’’ అని ప్రకటించారు. చిన్నారులు ‘వాళ్లకి సదుపాయంగా’ వుండే దుస్తులు ధరించి యించక్కా పాఠశాలలకి రావచ్చునట. అదరహో!