Others

వయోధిక స్పృహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితమంతా నటించాడు
ఇప్పుడట్లా కాదు.

తెల్లని వెంట్రుకలు అబద్ధం కాదు
శరీరంపై ముడుతలు అబద్ధం కాదు
తడబడే అడుగులు అబద్ధం కాదు
అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యే
కన్నీటి తడి అబద్ధం కాదు
సంధ్యాకాలంలోని
రంగుల కలయకా
దాని క్షణక్షణాక్రీడా అబద్ధం కాదు

జీవితమంతా పరుగులు తీశాడు
ఇప్పుడట్లా కాదు
మాటిమాటికి తన్నుకొచ్చే
వయోధిక స్పృహ అబద్ధం కాదు
గతంలో ఎన్నోసార్లు చనిపోయాడు
ఇవాళ చివరి మరణం గురించి
భయపడటం అబద్ధం కాదు
తన ప్రశ్నలకు ఎవరూ
సమాధానం చెప్పని పరిస్థితిలో
చుట్టూ ఒక
తీరని ఒంటరితనం
వ్యాపించడం అబద్ధం కాదు

అయతే
ఒక్కటి మాత్రం వాస్తవం
మొదటిసారి అందరి గురించి
ఆలోచించడం వాస్తవం
చిన్నపిల్లలను
గమనించడానికీ ప్రేమించడానికీ
సమయం దొరకడం వాస్తవం
మొదటిసారి
జీవితం ఎంత విలువైందో
గ్రహించడం వాస్తవం.
వృద్ధాప్యం ఒక మజిలి అనీ
అదొక కొత్త జాబిలి అనీ
దాని వెనె్నలపై
కవిత్వం రాయాలనుకోవడం మాత్రం
ఒక సుందరమైన వాస్తవం.
(వృద్ధోపనిషత్ (Old age poems)
అముధ్రిత కావ్యం నుండి)

- డా॥ ఎన్.గోపి