Others

షాంపూ వాడకపోతే ఏవౌతుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక జీవన విధానంలో కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. యాంత్రిక జీవనంలో అన్ని యంత్రాలపై తయారుచేసిన వస్తువులనే వాడేస్తున్నాం. ప్రకృతి సిద్ధంగా లభించే కుంకుడు కాయలతో తలస్నానం చేయటమంటే గంటసేపు పడుతోంది. కాబట్టి అంత సమయాన్ని వెచ్చించే ఓపిక, తీరిక లేక రూపాయి షాంపూ కొనేసి తలంటుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే సడన్‌గా షాంపూ వాడకం ఆపేస్తే ఏవౌతుందని చాలామంది అనుకుంటారు. ఏమీ కాదు. ఇంకా మంచిదేనని వైద్యులు అంటారు. నూనె తనంతట తానే ఉత్పత్తి చేసుకునే స్వభావం తలకు ఉన్నది. అందుకే ప్రత్యేకంగా ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదంటారు. ఈ షాంపూల వాడకం వల్ల జుత్తు గడ్డిగా మారిపోయి జుత్తు కుదుళ్లు ఆయిల్‌ను ఉత్పత్తిచేసుకునే స్వభావాన్ని కోల్పోతుందని చెబుతున్నారు. అలాగే కొన్ని నెలల తరువాత జుత్తు ఆరోగ్యంగా తయారవుతోంది. షాంపూలను కెమికల్స్‌తో తయారుచేస్తారు. కాబట్టి ఇలాంటి షాంపూల వల్ల సహజ స్వభావాన్ని కోల్పోయి అసహజంగా మారుతోంది.
***
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03