Others

అసమానతలపై ఆర్ట్‌తో పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల పట్ల చూపిస్తున్న అసమానతలపై పదిహేడేళ్ల యువతి తాను నేర్చుకున్న కళతో పోరుబాట పట్టింది. సామాజికి సమస్యలను ప్రధాన అంశంగా తీసుకుని ఈ చిన్నారి గీస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయటమే కాకుండా అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. పదిహేడేళ్ల వయసులో అమ్మాయిలు ఆధునిక ఫ్యాషన్లు ఒలకబోస్తూ.. షికార్లతో కాలాక్షేపం చేయాలనుకుంటారు. కాని ఢిల్లీకి చెందిన ఈ కాంచీ చోప్రా మాత్రం అలాంటి భ్రమల జోలికి పోకుండా ఆర్టివిజమ్‌తో తన బ్లాగ్‌లో వివిధ సామాజిక సమస్యలపై గీచిన చిత్రాలను పోస్ట్‌చేస్తూ తన కాలాన్ని సద్వినియోగం చేస్తోంది. అంగ సౌష్టవం, వర్ణ వివక్షత, లింగ వివక్షత, హింస తదితర సామాజిక సమస్యలపై చిత్రాలతో గళమెత్తుతోంది. కాంచి చోప్రా ఈ సమస్యలపై ఆర్ట్ వేయటంతో పాటు ఈ సందర్భంగా ఆమె ఆ బొమ్మతో పాటు జోడించే కామెంట్స్ ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఈమె బ్లాగ్‌ను దాదాపు 30 దేశాలవారు చూడటం విశేషం.
‘యాసిడ్ దాడులను ఆపండి’ అంటూ వేసిన ఆర్ట్ రెండు రోజులు సీరియల్‌గా రావటం జరిగింది. దాదాపు వెయ్యిమందికి తక్కువగాకుండా దీనిని చూడటమే కాదు, వారి అభిప్రాయాలను ఆమెతో పంచుకున్నారు. అలాగే వర్ణవివక్షతపై వేసిన ఆర్ట్‌ను యునైటెడ్ నేషన్స్ ప్రోగామ్‌వారు సైతం మెచ్చుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఐదేళ్లప్రాయంలోనే ఇలాంటి కళను అభ్యసించటం ఆరంభించిన కాంచీ చోప్రా చిన్నతనం నుంచే వివిధ వర్క్‌షాపుల్లో పాల్గొనటం, ఆర్ట్స్ తరగతులకు వెళుతూ తన కళకు మెరుగులు దిద్దుకుంది. ఐదవ తరగతి చదువుతున్నపుడే ఆడ శిశువుల హత్యలపై ఆమె గీచిన చిత్రం పలువురిని ఆకర్షించింది. ముత్యాలతో అలంకరించిన నెక్లెస్‌ను, ఏడుస్తున్న బాలిక బొమ్మ తలపై కత్తి ఉంచిన చిత్రాన్ని గీచి, ఆడపిల్లలను చంపవద్దు అని క్యాప్షన్ రాసింది. ఢిల్లీ పబ్లిక్ స్కూలులో చదువుతున్న కాంచీ తన విలువైన సమయాన్ని ట్యూషన్‌కు, ఆర్ట్‌కు కేటాయించుకుని ముందుకు సాగుతోంది.
ఈ సామాజిక చైతన్యం టైమ్‌పాస్ కోసం చేయటం లేదని తన ఆలోచనల నుంచే పుట్టిందని చెబుతోంది. ఆర్ట్+ఆక్టివిజమ్ అనే రెండు పదాలు కలిస్తేనే ఆర్టివిజమ్ వచ్చిందని, దీంతోనే తాను సామాజిక సమస్యలపై పోరాడుతున్నానని చెబుతోంది. మనం చేసే కామెంట్ కొంతమందిని ప్రభావితం చేస్తే అదే గొప్ప విజయమని నమ్ముతోంది. నా బ్లాగ్ చూసి అర్ధం చేసుకునేవారిని బట్టి తాను ఇంకా మెరుగుపరుచుకోవటం జరుగుతుందని వినమ్రంగా చెబుతోంది. ఆమె సోదరుడు సైతం కంప్యూటర్ సైన్స్ ద్వారా సామాజిక మార్పుకు కృషిచేస్తుండటం చూసి ప్రభావితురాలినై తాను ఆర్టివిజమ్ ద్వారా సామాజిక చైతన్యానికి నడుం బిగించినట్లు వెల్లడించింది. నైజీరియాకు చెందిన స్ర్తివాది న్గోజి అడిచే ఆమెకు ఆదర్శం. బొమ్మలు, సందేశాలు అంటూ కాంచీ తన చదువును నిర్లక్ష్యం చేయకుండా కన్నవారి కలలను నిజం చేసేందుకు పరీక్షల సమయంలో అదనపు గంటలు కష్టపడుతోంది. మానసిక సమస్యలపై ఓ పుస్తకాన్ని తీసుకువచ్చే ఆలోచనల్లో ఉంది. దేశ భవిష్యత్తు యువతరంపైనే ఉందని విశ్వసించే కాంచీ తాను స్ఫూర్తి పొందుతూ నలుగురికి స్ఫూర్తిని అందించమంటోంది.

chitram సాధికారిత, స్వావలంబనపై వేసిన ఆర్ట్
chitram కాంచీ చోప్రా