Others

ఓ వందమంది కావాలిట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాన్ మహమ్మద్ ఖిల్జీ పాకిస్తాన్‌లోని క్వెట్టా వాసి. వృత్తికి మెడికల్ టెక్నీషియన్ గానీ వైద్యం ప్రాక్టీసు పెట్టుకున్నాడు. అతనికి యిప్పుడు నలభై మూడు సంవత్సరాల వయసు. కానీ ముప్ఫయి అయిదుమంది సంతానం వున్నారు. ముగ్గురు భార్యలూ కలిపి ఖిల్జీకి ఇరవై ఒక్క మంది కూతుళ్ళనూ, పధ్నాలుగుమంది కొడుకుల్నీ కని యిచ్చారు. వాళ్లందరినీ అతను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. పోయిన నెలలో రెండు, మూడు భార్యలకి చెరో అమ్మారుూ పుట్టారు.
‘‘నాకు వందమంది సంతానం కావాలి. అల్లా దయ వుంటే, నా వంతు సేవగా దేశానికి వందమంది సంతానాన్ని అందించాలన్నదే నా లక్ష్యం’’ అంటూ చెప్పాడు. ఇరవై ఆరవ ఏట పెద్దలు ఏర్పాటుచేసిన మొదటి పెళ్లి చేసుకున్న జాన్- ‘‘నేను గరీబు నవాబుని’’ అంటాడు. ‘‘మత విశ్వాసం అపారం నాకు. ఎంతమంది సంతానం అధికంగా యిస్తే- ‘అధికస్య అధిక బలం’ మాకు’’ అన్నాడు.
ఫేస్‌బుక్‌లో మరో వివాహానికి రెడీగా వున్నాననీ, ఇష్టమున్నవాళ్లు సంప్రదించవచ్చునని, ఫొటోలు పెట్టాడు. డాన్ పత్రిక కథనం ప్రకారం అతని భార్యలు ముగ్గురూ 35మంది సంతానం కూడా క్వెట్టా శివారు గ్రామంలో ఓ పెంకుటింట్లో- యించక్కా- ‘‘గృహమే కదా స్వర్గసీమ’’ అని వుంటున్నారు.
‘‘ముప్ఫయి తొమ్మిదిమందికి రుూ యిల్లు చాలునా?’’ అనడిగితే- ‘‘ఇందులో అయిదు గదులున్నాయ్ సాబ్!’’ అన్నాడు. నా టార్గెట్ ప్రకారం వందమందిని కనాలి. అంటే, ముగ్గురు భార్యలకీ కాన్పు వెంట కాన్పులయిపోతున్నాయి. కనుక ‘అల్లా’ అంగీకారం వున్నది. కనుక మరో వివాహం చేసుకుంటున్నాను’’ అంటూ దగ్గరలో వున్న పెద్దమ్మాయిని- ‘బేటీ జాన్ షాగుఫ్తాననీ!’ అని పిలిచి- ‘‘నీకింకా తమ్ముళ్లు, చెల్లెళ్ళూ కావాలా? వద్దా?’’ అనడిగితే- ‘‘ఎంతమాట అబ్బాజాన్! తప్పకుండా కావాలి. మా అబ్బాజాన్‌ని నేను సపోర్టు చేస్తాను’’ అంది ఆ పిల్ల. ఐతే, భార్యలతో మాత్రం ‘ప్రెస్’వాళ్లని మాట్లాడనివ్వలేదు. పర్దాహైనా భాయ్!
‘‘మరి వీళ్లందరికీ బట్టలూ, చదువులూ యివ్వాలి కదా? వీటికి లక్షా ఇరవై వేల రూపాయలు ప్రతీ నెలా ఖర్చు అవుతోంది సాబ్!’’ అన్నాడు. పెద్ద బేబీ పదహారేళ్లదయితే చిన్న పాపాయిలకు పదహారు రోజుల వయసు. కాకపోతే అందరికీ చదువులు చెప్పిస్తానన్నాడు జాన్ సాయిబు. పొలిటికల్‌గా, సోషల్‌గా ఏక్టివ్. ఆమధ్య స్థానిక ఎన్నికల్లో పోటీ చేశాడు. జాన్ కి 950 ఓట్లు మాత్రమే పడ్డాయి.
తన ఫామిలీ వీడియోను ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ చేశాడు. దీన్ని 33 లక్షలమంది చూసి ఆనందించారు. లక్షా డెబ్భై ఐదు వేలమంది షేర్ చేశారు. ఇంక లైక్‌లా? కోకొల్లలు. ‘‘ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, యిక కనపడ్డ ప్రతీ పండూ తింటాడు. రోజూ అయిదుసార్లు నమాజ్ చేస్తాను. అల్లామీద భారం వేస్తున్నాను’’ అంటూ పిల్లలందరితో ఆడుకోవడం మొదలెట్టాడు మహమ్మద్ జాన్.