Others

పులులకు విముక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బౌద్ధ సన్యాసులు నడిపే ‘పులుగుడి’లో వందకుపైగా పెద్ద పులులు, వాటి సంతానం బ్రతుకు వెళ్లదీస్తున్నాయి. బౌద్ధ సన్యాసులు దీన్ని ‘సంరక్షణాలయం’గా చెబుతున్నా- యిది కేవలం ‘అక్రమ వ్యాపార నిలయం’. టూరిస్టుల దగ్గరనుంచి పులులతో ఆటలకు, సెల్ఫీలకు విపరీతంగా పైసలు గుంజుతున్నారు.
1994లో స్థాపించిన రుూ ఆలయం క్రమేపీ పులి చర్మం, పులి దంతాలు, కోరలు, గోళ్లు మొదలైనవి సమస్తం- చైనాకు అక్రమంగా అమ్ముకునే దొంగ నిలయాలైపోయాయి. థాయ్‌లాండ్‌లో పశ్చిమ రాష్ట్రం కాంచన్‌పురాలో వున్న రుూ సంరక్షణాలయానికి టూరిస్టులు ఎగబడతారు. సాలీనా దీని ఆదాయం మూడు కోట్ల ఎనభై లక్షల పౌండ్లుంటుంది. రెండున్నర లక్షలమంది చూస్తారు. టిక్కెట్ పదిహేను పౌండ్ల నుంచి నూట యాభై పౌండ్ల స్పెషల్ టిక్కెట్ దాకా వుంటుంది.
‘్థండర్’ అనే కూనకి బాటిల్‌తో మనమే పాలు పట్టాలీ అంటే స్పెషల్ టికెట్. తోకలాగటానికీ- యిలా రేట్లుంటాయి. 2015లోనే రుూ గుడి బద్నాం అయిపోయినా బౌద్ధగురువులు- అడ్డం పడ్డారు. మర్మావయవాలు సహా పులి శరీరంలోని ప్రతీ అంగానికీ ఒక రేటు.
చైనాలో యివన్నీ ముందు లేవు. ఈ టెంపుల్‌లో క్రూరమృగాలయిన పులున్ని వేటగాండ్రనుంచి కాపాడి పోషిస్తున్నారు అన్నది పచ్చి అబద్ధం. అవి కూడా భరించలేనంత క్రూరంగా వాటిని చావ చంపి, చెవులు మూసి సొమ్ములు చేసుకుంటున్నారు. అది పేరుకే గుడి. నిజానికి అది పులులకి నరకం. పోలీసుల దాడిలో పోయిన నెల ఓ ఇరవై పులి కూనలు- అందులోనూ పసి కూనల కళేబరాలు దొరికాయి. వీటిని మంచు పెట్టెల్లో పెట్టి దాచారు. ఈ విధంగా రుూ ర్యాకెట్ వెల్లడయి పులి గుడికి తాళాలు వేయమని ఉత్తర్వులు జారీచేశారు.
ఫేస్‌బుక్‌లో పులి టెంపుల్ బొమ్మలు చూసి వెళ్లిన బ్రిటీష్ విద్యార్థి బృందంలోని ‘ఇసెబెల్లె’ అనే అమ్మాయి పులికి స్నానం చేయించే టికెట్ కొనుక్కుని దానికి జలకాడిస్తూంటే అది పాపం! ఆమె కాలు నమిలి వేసిందట.
ఇలాంటి దుర్ఘటనలు, అక్రమ ఎగుమతి వ్యాపారం వగైరాలు రుూ క్రూర మృగాగారాన్ని మూసివేయించేస్తున్నాయి. పులుల్ని అడవుల్లో వదిలిపెడుతున్నారు. ఎట్టకేలకు వాటికి విముక్తి లభించింది. కాకపోతే యిలాంటి ఛోటా మోటా ఆలయాలు యింకా వున్నాయిట. ఔరా కామిరాలలో యింత షూటింగా?!