Others

వచ్చింది సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగ్యాల భోగి,
సంక్రమణ సంక్రాంతి గలగలా వచ్చాయి
సూర్యగమనంలో మార్పు తెచ్చే వేళ-
భోగిమంటల్లోన మనసులో చీకట్లు
మంచులా కరిగేను
చలి కాస్త వెనుదిరిగి
గోరువెచ్చని అనుభూతి అవనికి తెచ్చింది
వసంతానికి ముందు మురిసింది ధాత్రి
వచ్చింది సంక్రాంతి
ఇంటింట కాంతి

మనసులో గొబ్బిళ్ళు, మాటలో గొబ్బిళ్ళు
ముగింళ్ళలో నిలిచె ముత్యాల గొబ్బిళ్ళు
గుమ్మడి పువ్వుల్లా బంతీ, చామంతి
పసుపుతో పండిన పసిడి వాకిళ్ళు
కన్నుల పండుగ చేస్తున్నాయి
గుమ్మడి దానాలు యిచ్చేరు కొందరు
గుళ్ళలో జేజేలు పలికేరు కొందరు
కొత్త అల్లుడొచ్చాడండి అమ్మాయితోటి
బుజ్జిపాపను కోరి చేసే కోటి దండాలు
మరదళ్ళ మాటలు అనురాగ అస్త్రాలు
బొమ్మల కొలువులో
కొలువైన దేవుళ్ళు, తీరైన అందాలు
క్రొత్త ధాన్యాలు, కొంగ్రొత్త మాన్యాలు
పాల పొంగులు రంగుల హరివిల్లునందుతున్నాయి

హరిదాసు నటనలు,
నటనలో పాటలు
భోగిపళ్ళు పోసి
‘నూరేళ్ళ ఆయుష్షు’
దీవెనలందేటి చిన్నిపాపల్లు
వండేము బొబ్బట్లు
పొంగేను పొంగళ్ళు
భూమి దున్ని బువ్వనిచ్చిన యెద్దు
పచ్చిగడ్డి తిని పాలిచ్చే ఆవు
కనుమ సింగారాలు అందుకుంటాయి
రావమ్మ మహాలక్ష్మి రావమ్మ
కమ్మని క్రాంతిని కలచేయమమ్మా
పాత బంగారాన్ని క్రొత్తగా మలచుకొని
క్రొత్త కాంతుల సంక్రాంతి
నిలుపుకుంటామమ్మ

-ఎ.ఎన్.ప్రభాకర్, సికింద్రాబాద్