Others

వీరేశలింగ స్మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీకటిలో పడిపోతోంటే
ఆకటితో చనిపోతోంటే
దూరపు వెలుగులు తెచ్చినదెవరో
తీరని యాకలి తీర్చినదెవరో
మురుగు కాలువ ముందు వాసనలు
తరిగేస్తోంటే గర్భ గోళములు
తూములెత్తి మురుగంత సముద్రపు
దారి పట్టించిన పరదారులునెవరో
ఒకటే పాత ఒకటే రోత
కకవికలైన ప్రపంచంటెల్లను
చికిలి చేసి క్రొమ్మెరుపులు తెచ్చిన
శిల్పి ఎవరో శ్రీజల్పి ఎవరో
మిన్నున వెలుగున్నది కానీ
మన్నున నా వెలుగున్నదో లేదో
మన్నున నా వెలుగున్నదో లేదో
మన్నున పంటలు పండించుమురా
మిన్ను వెలుగుకై వెతపడకుమురా
అన్న మేలి మాటలు చెప్పినదెవరో
మారిన కాలం, తీరని దాహం
జారిన ధీమా, కోరిన దాహం
తెలియక, సొలయక, నడవండంచును
పలికిందెవరో! పలికిందెవరో!!
రామమోహనుడు రాచిన దారులు
కోమలాత్మకులు కొల్చిన దారులు
ప్రేమమృదాత్ములు విల్చిన దారులు
తెరిచినదెవరో! తీసినదెవరో!!
క్రొత్త క్రొత్త మార్గమ్ములు తీసి
క్రొత్త క్రొత్త దుర్గమ్ములు తెరిచీ
క్రొత్త క్రొత్త సర్గమ్ములు చేసీ
చిత్తమెక్కి విహరించినదెవరో
నట శివ సంధ్యా రోచి
ర్జటా పటల నిటాలాంతహ్‌పాతి
స్ఫుట వినీల కేశపచ్ఛవియై
కుటిలపరచినది ఎవరో ఎవరో!
ఇదియే మంచిది ఇదియే మంచిది
అది మంచిది, యప్పటికప్పటి
కది మంచిది వానికి వానికి
ఇది రహస్యమని చూపిన దెవరో
ఒకవైపున సృష్టియు జరుగును
ఒకవైపున లయమూ జరుగును
స్థితి ఈ రెంటి నడుమున యుండును
ఒక కాలమ్మున నన్ని యుండునూ
మహా ప్రళయ నటరాజాంశ
ప్రహారమై ఒక తేజః కణమది
విహారముగా వెడలినదో యన
సహాయమై వచ్చినదెవరో!
*
- విశ్వనాథ సత్యనారాయణ (1953లో)