Others

వయోక్రౌర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతలో ఇంత అందం పోయిందా! అనుకుంది ఓ యింతి
అద్దంముందు కోతి మనసున్న మనిషి వయస్సు,
తుళ్ళిపడే వయసునుంచి,
‘గుర్తుకొస్తున్నాయ’నుకొనే వయసువరకు
మధ్యలో ఎన్ని జీవన మజిలీలో!

మజిలి మజిలీకి మనమిప్పుడెలా ఉన్నామనే
మనస్తాపంతో, అబద్ధమాడని అద్దంముందు
నిలబడ్డప్పుడు,
మర్కట మనసున్న వయసు రోజులను
మరీమరీ మనన చేసుకుంటూ
రూప వ్యత్యాసావలోకనంతో
మధుర యవ్వన కాలాన్ని, అప్పటి సుందర రూపాన్ని,
ఏకరువు పెట్టుకుంటూంటే
మనస్సులో యించుకంత బాధ....
ఘనకీర్తి గడించిన అలనాటి కళాకారుల
సుందర రూప మననం,
యిప్పటి రూపంలో ఎంత సంభ్రమాశ్చర్యం!
వయస్సింత క్రూరమైనదా! అని....

కాలం, వయస్సు, చెట్టాపట్టాలేసుకొనే చెలిమిలో
కాలం నిర్దేశించిన వయోరూపం,
పెరిగి పెరిగిపోయే ప్రాయం,
అంతరించిపోయే అందం,
శుష్కించుకొనియే శరీరం,
‘ప్రకృతి ధర్మ’మని అనిపించుకొంటూ,
‘అంతేలే’ అని అనుకొంటూ
దేహరూపం కన్నా
మహానీయత, మంచితనాల మనోసౌందర్యం మిన్న
అని అనుకున్నా..

- వేదం సూర్యప్రకాశం 9866142006