Others

హైవేపై ఆనంద వీచిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనా ఇక్భాల్ బైక్ రైడర్. ఇప్పటికే దేశంలోని 83 పట్టణాలను చుట్టేసింది. బైక్‌లో షికారు చేయటం ఈమె హాబీ కాదు. ఒంటరిగా, నిర్భయంగా బైక్ రైడింగ్ చేస్తూ విద్యార్థులతోనూ, యువతీ యువకులతో మమేకమైపోతుంది. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నట్లు నేటి యువత నిస్తేజంగా..నిర్వేదంగా బతుకు బండి లాగించేస్తోంది. అటువంటి యువతలో చైతన్యాన్ని నింపే పని చేపట్టి ఇలా దేశవ్యాప్తంగా బైక్ రైడింగ్‌కు ఉపక్రమించింది. డిప్రెషన్‌తో ఆత్మహత్యలకు తెగబడుతున్న యువకులలో నైరాశ్యపు ఛాయలు తొలగించేందుకు యూనివర్శిటీలలో, కాలేజీలలో ఉచిత సెమినార్లు ఏర్పాటుచేస్తోంది. సంతోషంగా ఉండటం ఎలా? అనే అంశమే ఈ సదస్సులలో ప్రధాన అంశంగా చర్చ జరుగుతోంది. గత నెల హైదరాబాద్ నుంచి ప్రారంభించిన ఈ బైక్ రైడింగ్ జూన్ 12వ తేదీకి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఇప్పటి వరకు గోవా, చండీగఢ్, అమృతసర్, పటియాల, పఠాన్‌కోట, శ్రీనగర్, జమ్మూ తదితర ప్రాంతాలను చుట్టేసింది. 27 ఏళ్ల సనా ఇక్భాల్ ఇలా బైక్ రైడింగ్ చేయటానికి కారణం తన చిన్నతనంలో ఆమె తండ్రి తీవ్రమైన అసంతృప్తితో జీవితాన్ని ముగించాడు. అంతేకాదు ఆమె కూడా 26 ఏట ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాని కొన్ని రోజులకే పెళ్లి విచ్ఛన్నమవ్వటం, తీవ్రమైన మానసిక పరిస్థితులలో ఆత్మహత్యకు పాల్పడాలని సంకల్పించింది. రోడ్డుపై నిస్తేజంగా వెళుతుంటే ఓ పాప సంతోషంగా చేయి ఊపుతూ చూడటం కనిపించింది. అంతే.. అమాయకమైన ఆ పాప వలే తానేందుకు సంతోషంగా ఉండలేకపోతున్నానని ప్రశ్నించుకుంది. జీవితాన్ని ఆనందమయంగా గడపాలనే కృతనిశ్చయంతో బైక్‌రైడింగ్ నేర్చుకుని ఇలా దేశమంతా చుట్టేస్తూ ‘‘ప్రతి ఒక్కరూ పసిపాప వలే ఆనందంగా గడపటమే జీవిత ధ్యేయం’’ అనే సందేశాన్ని ఇస్తూ బైక్‌పై ప్రయాణం ఆరంభించింది. నా ఈ పయనం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని సన వెల్లడిస్తోంది. దీని గురించి ఆమె తల్లిని ప్రశ్నిస్తే తీవ్రమైన మానసిక ఒత్తిడితో జీవితాన్ని ముగిస్తుందని భయపడిన తాను ఈరోజు ఆమెను చూస్తే గర్వంగా ఉందని చిరునవ్వుతో సమాధానమిస్తోంది.