AADIVAVRAM - Others

ఐదు బహుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆద్యంత్ పుట్టిన రోజు జరుపుకున్న మర్నాడు వాడిని తల్లి అడిగింది.
‘నిన్న నువ్వు ఆరు తప్పులు చేసావు. నిన్న నీ పుట్టినరోజు కదా? చెప్తే బాధపడతావని వాటిని నిన్న నీకు చెప్పలేదు. అవేమిటో తెలుసా?’
‘తెలీవు. ఏమిటవి?’ ఆద్యంత్ అడిగాడు.
‘నేను నీకు జాబితాని, డబ్బుని ఇచ్చి దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకు రమ్మంటే ఏమన్నావో గుర్తుందా?’
‘ఆ.. నా పుట్టిన రోజు నాడు కూడా నాకు పనులు చెప్తావా? అన్నాను. కాని నువ్వు నాకు పాయసం వండటానికి ఏలకులు, జీడిపప్పు, కిస్‌మిస్‌లని తేవాలని అందులో రాసానని చెప్పాక వెంటనే ఆ పని చేశాను’
‘కాబట్టి నువ్వు మాట్లాడబోయే ముందు ఎదుటి వాళ్లు చెప్పేది మధ్యలో అడ్డు పడకుండా పూర్తిగా వినాలి అని అర్థమైందా?’
‘నిజమే. అర్థమైంది’ వాడు కుడిచేతిని పైకెత్తి ఓ వేలు మడిచాడు.
‘నాన్న నీకు పుట్టినరోజు బహుమతిగా ఎర్రరంగు కాగితం అతికించిన అట్టపెట్టెని ఇస్తే, అది పిచ్చి బహుమతి అని విసిరికొట్టావు. తీరా చూస్తే అందులో నీకు ఇష్టమైన ఎక్లెయిర్ చాక్లెట్స్ ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలోనైనా స్పందించే ముందు ఆలోచించాలి’
‘నిజమే’ ఆద్యంత్ సిగ్గుపడ్డాడు.
‘అక్క నీకు పుట్టిన రోజుకి బహుమతి ఏం ఇవ్వలేదని విమర్శించావు. కాని అది నీకు అకస్మాత్తుగా కనపడి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా అవాలని బహుమతిని నీకు కనపడే చోట ఉంచింది. దాన్ని నువ్వు ఆలస్యంగా చూసావు. కాబట్టి విమర్శించే ముందు కొంతసేపు ఆగటం నేర్చుకో’
‘నిజమే. సారీ అక్కా’ ఆద్యంత్ మూడో వేలు మడిచి అక్క వైపు తిరిగి చెప్పాడు.
‘పుట్టిన రోజు పార్టీ తర్వాత నిన్న సాయిబాబా గుడికి వెళ్లి ప్రార్థించాం. కాని నీ మిత్రుడు కృపాల్ మీద కోపంతో వాడ్ని పార్టీకి పిలవలేదు. ప్రార్థించడానికి మునుపు క్షమించడం నేర్చుకో’
‘ఇదీ నిజమే’ చెప్పి ఆద్యంత్ ఇంకో వేలుని కూడా మడిచాడు.
‘నిన్న కేరంబోర్డ్ ఆటలో నీకు పాయింట్స్ రావడం లేదని కాయిన్స్ అన్నీ కలిపేసి లేచి వెళ్లిపోయావు. ఆడకపోతే ఎలా ప్రాక్టీస్ అవుతుంది? ఏదైనా వదలబోయే ముందు చివరిదాకా ప్రయత్నించాలి. చివరగా ఖర్చు చేయబోయే ముందు సంపాదించు. విలాసానికి కాక అవసరానికి ఖర్చు చేయడం కూడా నేర్చుకో’
‘అర్థమైంది. నిన్న నేను నా పాత వౌత్ ఆర్గన్ ఉండగా నాకు వచ్చిన బహుమతి డబ్బుతో ఇంకోటి కొన్నాను. ఇవి నినే్న నువ్వు నాకు చెప్పి ఉంటే, నా పుట్టిన రోజుకి ఐదు బహుమతులు ఇచ్చిన దానివి అయ్యేదానివి. నిన్న చెప్పినా బాధపడేవాడిని కాదు’ ఆద్యంత్ చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి