AADIVAVRAM - Others

పక్కింటివాళ్ల వెన్నుపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామారావు (రాజోలు)
ప్రశ్న: మా ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత స్లాబ్ లెవల్ వరకు వచ్చి ఆగిపోయింది. ఇలా జరిగి ఐదు నెలలైంది. ఎంత ప్రయత్నించినా ఒక అడుగు కూడా ముందుకు జరగడం లేదు.
జ: ప్లాన్ ప్రకారం మీరు నిర్మిస్తున్న ఇంటికి బేస్‌మెంట్ నిర్మాణంలో నైరుతి పెరిగింది. అందువలన ఇలా జరుగుతున్నది. ముందుగా ఆ పెరిగిన నైరుతి భాగాన్ని సరిచేసుకోండి. దీనివల్ల దోషం తొలగుతుంది. తర్వాత స్థలంలో ఒక యంత్రాన్ని ప్రతిష్ఠించుకోండి.
ఆర్.ప్రసాద్ (తణుకు)
ప్రశ్న: నా పేరు ప్రకారం గృహ నిర్మాణానికి ఏ దిశ యోగిస్తుంది?
జ: మీ పేరునుబట్టి తూర్పు, దక్షిణం రోడ్లుగల ఆగ్నేయం బ్లాకు చాలా బాగా యోగిస్తుంది.
గోపాలరావు (కనిగిరి)
ప్రశ్న: మా ఇంటికి పక్క ఇంటి వాళ్ల వెన్నుపోటు కలుగుతున్నది. పరిష్కారం తెలుపగలరు.
జ: దీనికి సంబంధించి యంత్రాల ద్వారా పరిష్కారం కలదు.
వి.కనకారావు (హైదరాబాద్)
ప్రశ్న: మా స్థలానికి నైరుతిలో (దక్షిణ) వీధి పోటు ఉన్నది. ఇందులో ఇంటి నిర్మాణం చేద్దాం అనుకొంటున్నాం. చేయవచ్చా?
జ: దక్షిణ నైరుతి పోటుగల స్థలంలో ఇంటి నిర్మాణం చేయకపోవడం ఉత్తమం. నిర్మాణం మొదలు పెట్టిన దగ్గర నుండి సమస్యలు వస్తాయి. కావున ఆ స్థలాన్ని అమ్మివేయండి.
ఎన్.రామలింగం (తాండూరు)
ప్రశ్న: మేం 15 సం.లుగా ఈ ఇంట్లో నివసిస్తున్నాం. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి తరచూ ఆరోగ్యం బాగోలేక పోవడం జరుగుతోంది. కారణం తెలియడం లేదు.
జ: ఇంటి స్థలంలో నైరుతి మూల పెరగడం జరిగింది. అదే విధంగా నైరుతి భాగం ఇంటి కట్టుబడిలో కూడా పెరిగింది. ముందుగా స్థలంలో పెరిగిన నైరుతి భాగాన్ని వేరుచేస్తూ బేస్‌మెంట్ నిర్మాణం చేసి తర్వాత ప్రహరీగోడను నిర్మించుకోండి. దీనివల్ల నైరుతి దోషం పోతుంది. తర్వాత ఇంటి కట్టుబడిలో పెరిగిన నైరుతి దోషాన్ని యంత్రాల ద్వారా సరిచేసుకోండి. ఈ నైరుతి దోషం కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లో ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -9642706128