AADIVAVRAM - Others

చర్య (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఎలా ఉండాలో గతంలో చెప్పేవాళ్లు కాదు. ఇన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా లేవు. అయినా చాలామందిలో మంచి వ్యక్తిత్వం వుండేది. మంచితనం ఎక్కువగా కన్పించేది. ఇతరులకి సహాయం చెయ్యాలన్న కాంక్ష కూడా ఎక్కువగా కన్పించేది. ఇప్పుడు అలాంటి భావన లేదని కాదు. ఇప్పుడూ ఇలాంటి భావన వున్న వ్యక్తులు చాలామంది కన్పిస్తున్నారు. అయితే ఇలాంటి భావనలు రావడానికి వాళ్లు చాలా పుస్తకాలు చదవాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ సెంటర్లకి వెళ్లాల్సి వస్తుంది. దీనికి కారణం కుటుంబ వాతావరణంలో వచ్చిన మార్పులు!
గతంలో ఇంటికి ఎవరు వచ్చినా ముందుగా ఓ చెంబెడు మంచినీళ్లు ఇవ్వడం ఓ అలవాటుగా ఉండేది. ఇంటి యజమానే స్వయంగా తెచ్చి ఇచ్చేవాడు. పిల్లలతో ఇప్పించేవాడు. ఇంట్లో పెద్దవాళ్లు లేకపోయినా పిల్లలు ఆ అలవాటును పాటించేవాళ్లు. పరిచితులకే కాదు. అపరిచితుల పట్ల కూడా ఇదే పద్ధతిని పాటించేవాళ్లు. మజ్జిగను కూడా తెచ్చి ఇచ్చేవాళ్లు.
మన ఇంటికి వచ్చిన అతిథులకి మంచినీళ్లు ఇవ్వాలని, మజ్జిగ ఇవ్వాలని పిల్లలకి ప్రత్యేకంగా చెప్పేవాళ్లు కాదు. అలా ఇవ్వాలని చెప్పే పుస్తకాలు కూడా కన్పించేవి కావు. అదో అలవాటుగా కన్పించేది. దాన్ని చూసి పిల్లలు నేర్చుకునేవారు.
ఈ కాలంలో అతిథులు వస్తే పిల్లలు బయటకు రావడంలేదు. వచ్చిన వాళ్లు ఎవరోనన్న ఉత్సుకత కూడా వాళ్లలో కన్పించడం లేదు. చదువుతూనో, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలతో వాళ్లు నిమగ్నమై ఉంటున్నారు. చూసి నేర్చుకునే అవకాశాలు వాళ్లకి తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఈ విషయాలు తెలుసుకోవడానికి వాళ్లు పుస్తకాలు చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కౌన్సిలింగ్‌కి వెళ్లాల్సి వస్తుంది.
ఇంటికి వచ్చిన వ్యక్తులకి మంచినీళ్లు, మజ్జిగ ఇవ్వడం చాలా మామూలు విషయంగా అన్పిస్తుంది కానీ అందులో ఎంతో అర్థం ఉంది. ఎదుటి వ్యక్తులకి మన దగ్గర వున్నది ఏదైనా ఇచ్చే పరిస్థితిలో ఉండాలి అన్న భావన కన్పిస్తుంది. వాళ్లను గౌరవించడమూ కన్పిస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలను ప్రత్యేకంగా పిల్లలకి పెద్దవాళ్లు చెప్పేవాళ్లు కాదు. వాళ్లు పాటించడం ద్వారా, వారి చర్యల ద్వారా చెప్పేవాళ్లు. జీవితం అంటే చూసి నేర్చుకోవడమే కదా! చిన్నదైనా పెద్దదైనా ఇవ్వడంలో ఎంతో ఆనందం ఉంటుంది. మనమే స్వయంగా ఇవ్వడం ఇంకా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. మనకన్నా ఎక్కువగా ఎదుటి వ్యక్తులకి.