Others

లాలాజలం ఎక్కువైనా తక్కువైనా జబ్బే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాలాజలంవల్ల కూడా బాధలు కలుగుతాయా అని ఆశ్చర్యపోతున్నారా? లాలాజలం ఎక్కువైతే ఓ బాధ, తక్కువైతే మరో బాధ. ఎక్కువైతే చొంగ కార్చడం లాంటివి చూస్తాం, తక్కువైతే నోరు ఎండిపోవడం లాంటివి చూస్తాం. శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రతి పదార్థం సరైన మోతాదులో గనుక ఉత్పత్తి కాకపోతే దానివల్ల మనకి బాధే కలుగుతుంది. శారీరక, ఆర్థిక, మానసిక బాధే మిగులుతుంది. లాలాజలంవల్ల బాధపడేవాళ్లని చూసినపుడల్లా నాకు ఏం అనిపిస్తుందంటే- ‘‘దేన్నీ చిన్నచూపు చూడకు- దేని ప్రభావం దానిదే, దేని స్థాయి దానిదే’’.
లాలాజలం అనగా?
మన నోరుకి ఇరువైపులా ఉండే గ్రంధులనుంచి ఉత్పత్తి అయి మన నోట్లోకి పారే ఉమ్మినీరు. దీనికి మరొక పేరు లాలాజలం. వాడుక భాషలో ఉమ్ము అని అంటారు.
దీని ఉపయోగం?
మన పళ్లని శుభ్రంగా ఉంచడం, నాలిక మరియు చిగురులు ఇంకా బుగ్గలు ఎండిపోకుండా తడిగా ఉంచడం, మనం నమిలిన ఆహారంతో కలిసిపోయి దానిని ముద్దలా మార్చి సునాయాసంగా మింగేలా చేయడం, పెదాలు ఎండిపోకుండా కాపాడడం, మనం తినే ఆహారంలో కొన్ని క్రిములు కడుపులోకి వెళ్లకుండా వాటిని చంపడం, ఆహారంలోని కొవ్వును ఎంజైముల ద్వారా కరిగించడం లాంటివి చేస్తుంది.
లాలాజలం ఎక్కువైతే?
సాధారణంగా లాలాజలం నోట్లో 0.1 /జశ కింద ఉత్పత్తి అవుతుంది. తినేప్పుడు ఇది 45 /జశకి పెరుగుతుంది.
కొందరిలో ఇది మామూలుకంటే అధికంగా ఉత్పత్తి అవుతుంది. నోరు అంతా ఉమ్ముతో నిండి, పెదాల పక్కనుంచి కారుతూ వుంటుంది. దీనిని ‘చొంగ కార్చడం’ అంటాం. ఈ చొంగ కార్చడం నాలుగేళ్ల వయసు వరకూ కనిపించే సాధారణ విషయం. ఆ తర్వాత కూడా అంటే అప్పుడు ఆలోచించాల్సిన విషయం.
ఇలా చొంగ కార్చడానికి గల కారణాలు
1.మెదడు/నరాల సమస్య
2.ఏదైనా మందులవల్ల కలిగే అనుసంగ ప్రభావము
3.తల స్థానం సరిగా లేకపోవడం
మెదడు / నరాల సమస్య
ళఉ్గఉఱ్గజ -జడకూ/ ఫేషియల్ నరం పక్షవాతం దీనికి కారణం కావచ్చు. ప్రమాదాల్లో మెదడుకి గాయం కలిగినపుడు ఈ చొంగ కార్చడం కొన్ని సందర్భాలలో చూస్తాం.
మందుల అనుసంగ ప్రభావం
కొన్ని మందుల వల్ల ఈ లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రమాదం వుంది. వీరిలో ఆ మందుల వాడుక ఆపడం లేక తగ్గించడం చెయ్యాలి.
తల స్థానం
కొంతమంది కూర్చొని నిద్రపోయేవాళ్లలో, మంచంమీద బోర్లాపడుకున్నప్పుడు వారి దిండ్లమీద ఈ చొంగ కారడం చూస్తాం. దీనికి కారణం వీరి తల ఒక పక్కకి, కిందకి వాలిపోవడం, చాలా సేపు అలానే వుండడంవల్ల ఉమ్మినీరు ఏటవాలుగా ఉన్న దిశలో పారి పెదాల పక్కనుంచి కారుతుంది. వీళ్లు వీరి తలని సరైన స్థానంలో ఉంచుకొనే విధంగా వ్యవహరించాలి.
చొంగ కారడంవల్ల కలిగే నష్టాలు?
చొంగ కారడంవల్ల పెదాలు, గొంతుక కొంతమందిలో బట్టలు కూడా తడిసిపోతాయి. ఇలా చొంగ కారుస్తూ సమాజంలో ఎవర్ని కలవలేక, ఉద్యోగం లేక వ్యాపారం చెయ్యలేక, ఒక గదిలో ఉండిపోయి వీరు తీవ్ర ఒత్తిడికి మరియు మాంద్యానికి (డిప్రెషన్) గురవుతారు. చొంగ కారడంవల్ల పెదాలకి ఇన్‌ఫెక్షన్, చర్మం చిట్లడం లాంటివి జరగొచ్చు.
దీనికి చికిత్స
ఫేషియల్ నరం పక్షపాతంవల్ల ఈ సమస్య కలిగినవాళ్లలో ఆ నరానికి ఆపరేషన్ ద్వారా చికిత్స చేసే ప్రయత్నం చేస్తారు. (ఇది మరోసారి చర్చించుకుందాం)
నాలుగు సంవత్సరాల వయసు తర్వాత కూడా ఈ సమస్య ఉన్న పిల్లలకి ఆ ఉమ్మినీరు ఎప్పటికప్పుడు మింగేసేలా ట్రైనింగ్ ఇస్తారు. ఇలా చేసే పిల్లల్లో చొంగ కారడం తగ్గుతుంది, మింగడం ఎక్కువవుతుంది. కొంతమందిలో మందులు వాడతారు. దీనివల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గి చొంగ కారడం తగ్గుతుంది. కొత్తగా ఇప్పుడు ఱ్జ్జతి ఇంజెక్షన్లు వాడుతున్నారు. ఈ ఱ్జ్జతి చర్మంపై ఉన్న ముడతలు పోవడానికి కూడా వాడతారు. ఈ మందు లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంధులలోకి ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. దీనివల్ల ఉమ్మినీరు ఉత్పత్తి తగ్గుతుంది. ఈ మందు ప్రభావం మూడు లేక నాలుగు రోజుల తర్వాత కనబడుతుంది. నాలుగు నెలల వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఇంజెక్షన్ తీసుకోవాలి.
పై చెప్పినవేవి పనిచెయ్యనపుడు ఆపరేషన్ చెయ్యడం ఉత్తమం. లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులను కోసి తీసేయాల్సి వుంటుంది. ఇది ఒక విధానం, మరో విధానం ఏంటంటే, ఉమ్మినీరు ఏ రంధ్రం నుంచి బయటికి వస్తుందో ఆ రంధ్రాన్ని నోట్లోంచి తీసి, గొంతులో పెట్టడం లేక ఆ రంధ్రాన్ని దారంతో కట్టేసే ప్రయత్నం చేయడం. మొదట చెప్పిన దాంట్లో ఉమ్మినీరు నోట్లోకి రాకుండా ఏకంగా గొంతులోకే వెళ్లిపోతుంది. రెండో దాంట్లో ఉమ్మినీరు బయటికి వచ్చే రంధ్రం మూసుకుపోవడం కారణంగా లాలాజలం బయటికే రాదు.
ఒకసారి ఒక తండ్రి, కొడుకు ఎక్కడపడితే అక్కడ ఉమ్ముతాడని, నిమిషానికి ఐదారుసార్లయినా ఉమ్ముతాడని, దీనికి కారణం, పరిష్కారం తెలుసుకోవాలని నాదగ్గరికి వచ్చాడు. అతనే కాదు చాలామందిలో ఇదొక మానసిక జబ్బు. వీరిలో చాలామందికి ఏ వ్యాపకం ఉండదు. అందుకే ఉమ్ముతూ కాలాన్ని వెళ్లబుచ్చుతారు. ఇలాంటి సమస్య ఉన్నవారిని ముందు పరీక్షించి ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇప్పించడం మంచిది. చాలామంది వారి లాలాజలం వారే మింగడానికి అసహ్యించుకుంటారు. వాళ్లందరికీ నేను చెప్పేది- ‘‘బాస్! అది నీ ఉమ్మినీరే, నీది నీవే అసహ్యించుకోవడం ఎంతవరకు సబబు?’’ ఆలోచించండి.
వచ్చేవారం ఉమ్ము తక్కువైతే వచ్చే కష్టాలేంటో చూద్దాం.

-డా. రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్ సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com