Others

సైనస్...ఆనందానికి మైనస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కువ శాతం మంధి ఆడ, మగ తేడా లేకుండా సైనస్ సమస్యతో బాధపడుతూ వుంటారు. చాలామంది బాధితులు ఎంతోమంది డాక్టర్ల దగ్గర చికిత్స చేసుకున్నాం, కొందరయితే ఆపరేషన్ కూడా చేయించుకున్నాం, అయినా ఈ సైనస్ సమస్య తగ్గలేదు అని బాధపడుతూ ఉంటారు. రోగులను బాధపెడుతూ వైద్యులను వొత్తిడికి గురిచేస్తున్న ఈ సైనస్ మన ఆనందానికో పెద్ద మైనస్. నేడు ఈ సైనస్ సమస్య గురించి చర్చిద్దాం.
సైనస్ అంటే?
ఒక ఖాళీ స్థలము, ఇలాంటివి ముఖంలో చాలా చోట్ల ఉంటాయి. చెంపల కింద, ముక్కు పైభాగంకి ఇరువైపులా మరియు లోపలా, కనుబొమ్మలమీద.
ఏ సైనస్‌వల్ల సమస్య
ఎక్కువగా వస్తుంది?
ఏ సైనస్ వల్లనైనా రావచ్చు. అయితే చెంపల కింద ఉండే ఘనజ్ఘూక డజశఖఒ సమస్య చాలా మందిలో కనపడుతుంది.
ఘౄనజ్ఘూక డజశఖఒకి సమస్య ఎందుకు వస్తుంది?
ఏ సైనస్ అయినా నీరు లాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మన ముక్కులో వున్న రంధ్రాలలోంచి మన గొంతులోకి వెళ్లాలి. కానీ కొందరిలో ఆ రంధ్రం ఏదో కారణంగా మూసుకుపోవడంవల్ల ఆ నీరు సైనస్‌లోనే ఉండిపోయి ఇన్‌ఫెక్షన్‌కి దారితీస్తుంది. చాలామందిలో ఘనజ్ఘూక డజశఖఒకి సంబంధించిన రంధ్రం మూసుకుపోవడంవల్ల ఈ సైనస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అదేకాకుండా ఈ నీరు ఉత్పత్తి చేసే సైనస్‌లోని పొరకి వైరస్‌వల్లో, పుచ్చుపళ్లవల్లో, ఫంగస్‌వల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల కూడా ఈ సైనస్ సమస్య కలగొచ్చు.

ఇదే కాకుండా ఈ రంధ్రాలు పాలిప్స్‌వల్లో, అ న్యమైన పదార్థాలవల్లో, తిత్తివల్లో మూసుకుపోయే ప్రమాదం ఉంది.
ఈ సమస్య వస్తే కనిపించే
లక్షణాలు ఏంటి?
ముక్కు మూసుకుపోవడం, జ్వరం, తల బరువుగా అనిపించడం, తలనొప్పి, పైపళ్లనొప్పి, ముక్కులోంచి చీము కానీ నీరు కానీ కారడం, ఆ సైనస్ ఉన్న ప్రదేశంలో నొక్కితే, నొప్పి పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దీనికి చికిత్స?
సైనస్ సమస్యలో సమయం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎన్ని రోజులుగా ఈ సమస్య ఉందన్న దానిపై దీనిని రెండు దశలుగా విభజిస్తారు.
తీక్షణ దశ
సమస్య మొదలై నాలుగు వారాలకన్నా ఎక్కువ కాకపోతే దానిని తీక్షణ దశగా గుర్తిస్తారు. ఈ దశలో సమస్య ఒకవైపే ఉందా లేదా ముఖానికి యిరువైపులా వుందా అని మనం మొదట నిర్థారణ చేసుకోవాలి. ఎక్స్‌రే ద్వారా ఏ సైనస్‌లో సమస్య ఉందో తెలుసుకోవచ్చు. క్రిములు గానీ, పుచ్చు పళ్లు కానీ ఈ సమస్యకి కారణం కావచ్చు. క్రిములవల్ల అయితే మందులు వాడాల్సి వుంటుంది. మందులు వాడినా ఫలితం దక్కనివారిలో సిటి స్కాన్ తీయించి మూసుకుపోయిన ఆ సైనస్ రంధ్రాన్ని తిరిగి తెరుచుకునేలా చేస్తారు. 10-15 శాతంలో పుచ్చుపళ్లు ఈ సమస్యకి కారణం కావచ్చు. వీరిలో తగిన దంత చికిత్స పైపళ్లకి చేయించి మందులు వాడాల్సి వుంటుంది.
దీర్ఘదశ
సమస్య పనె్నండు వారాలైనా తగ్గకపోతే దాన్ని దీర్ఘదశగా గుర్తిస్తారు. వీరిలో సమస్య ముఖానికి ఇరువైపులా వుంటుంది. సిటి స్కాన్, ఎంఆర్‌ఐ వీరిలో తీయించాల్సి వుంటుంది. ఈ సమస్య క్రిములవల్లగానీ, ఫంగస్ వల్ల కానీ, అలెర్జీవల్లకానీ రావచ్చు.
బాక్టీరియా (క్రిములు)వల్ల వచ్చిన సమస్యకి 4 నుంచి 6 వారాలు వివిధ రకమైన మందులు ఇవ్వాల్సి వుంటుంది. సిటి స్కాన్, ఎంఆర్‌ఐలో ఏదైనా సమస్య కనిపిస్తే దానిని ఆపరేషన్ ద్వారా తొలగించాల్సి వుంటుంది. మూసుకుపోయిన రంధ్రాన్ని తిరిగి తెరవడం, సైనస్‌ని శుభ్రపరచడం లాంటివి ఎండోస్కోపీవల్ల కానీ, పై మధ్య పళ్ల చిగురులోంచి ఆపరేషన్ చేసి కానీ చేస్తారు. పాలిప్స్ ఉన్నా అన్యమైన పదార్థాలు ఉన్నా, తిత్తులు ఉన్నా ఈ ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నిర్మూలిస్తారు.
ఫంగస్‌వల్ల వచ్చే సైనస్ సమస్య చాలా ప్రమాదకరమైనది. రోగ నిరోధక శక్తి తక్కువ వున్న వారిలో (ఎయిడ్స్), తీవ్రమైన మధుమేహం ఉన్నవారిలో, కాన్సర్ ఉన్నవారిలో, అవయవ మార్పిడి జరిగినవారిలో ఇది వచ్చే ప్రమాదం ఉంది. సిటి స్కాన్‌లో ఎంతవరకు కండని, ఎముకని, సైనస్‌ని ఫంగస్ తినేసిందో మనకి తెలుస్తుంది. తినేసిన ప్రాంతాన్ని మొత్తాన్ని 2 సెం.మీ అధికంగా నిర్మూలించాల్సి వుంటుంది. ఇది చాలా పెద్ద ఆపరేషన్. దీనితోపాటు ఫంగస్‌ని చంపే మందులు వాడాల్సి వుంటుంది.
అలెర్జీవల్ల వచ్చే సమస్యకి దీర్ఘకాలిక ఉపశమనం లేదు. దేనివల్ల ఈ సమస్య వస్తుందో తెలుసుకొని దానికి దూరంగా ఉండడం ఈ సమస్యకి మూల చికిత్స. కొంతమందిలో ఏసీవల్ల ఈ సమస్య కలుగుతుంది. వారు ఏసీ వాడకూడదు. దుమ్మువల్ల కలిగే వారు ఆ ప్రదేశానికి వెళ్లకుండా, ముక్కుకి ఇంకా మూతికి మాస్కు కట్టుకొని తమని తాము కాపాడుకోవాలి. ఋతువుల మార్పిడివల్ల కొంతమందిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఆ ఋతువు వచ్చినపుడు మందుల ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందే ప్రయత్నం చెయ్యాలి. ఎండోస్కోపి మరియు ఆపరేషన్‌లు కొందరిలో మాత్రమే సఫలీకృతం అవుతాయి.
సృష్టి మనుషులకన్నా ఎప్పుడూ పదడుగుల ముందే వుంటుంది. సమాధానాలకోసం పరిశోధకుల వేట సృష్ఠి మనతో ఆడే ఓ ఆట. ఈ వేట వేటు కొనసాగేంతకాలం మనిషి ఆగడు, సృష్టి ఆపదు. సమాధానాలు దొరుకుతూనే వుంటాయి, కొత్త సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ఇది సృష్టి తనతో తాను ఆడుకునే ఓ ఆట. ఎందుకంటే మనిషి కూడా సృష్టిలో ఓ భాగమే కదా! ఎంత చేసినా, ఏం చేసినా ఈ సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందనివారికి సరైన సమాధానం ఎప్పుడు దొరుకుతుందో నిత్యం ప్రయోగాలు చేస్తున్న పరిశోధకులకే తెలియాలి. ఆ సృష్ఠే దాన్నివ్వాలి.

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615