Others

మంచినీళ్లతో కారు కడిగితే ‘ఫైన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హోస్ పైపు’’ దొరికితే చాలు- బూస్టర్ పంపులు, ఓవర్‌హెడ్ టాంకులు గలవాళ్ల సెక్యూరిటీ సిబ్బంది ట్రిగ్గర్ హ్యాపీ అయిపోతారు. గేదెల దగ్గరనుంచి మోటారు కార్లదాకా తెగ కడిగేస్తారు. లాన్‌లకి, కారిడార్‌లకి, మొక్కలకి మాత్రమేనా? గేటులు దాటి యాభై గజాలదాకా పొద్దునే్న ‘హోస్‌పైపుల జల విన్యాసాలు’ మనం నగరంలో అపార్టుమెంటుల దొంతర్లమధ్య చూస్తుంటాం. ఒకచోట గ్రుక్కెడు నీళ్లకు అలమటిస్తూ వుంటే అదే పేద వర్గానికి చెందిన వర్కర్‌లు మంచినీళ్లతో ఆడుకుంటారు. కాని పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధాని చండీఘడ్ నుంచి వచ్చిన వార్త ఒక ఊరట- మరో సూచన- రెండూ చేస్తున్నది. మంచినీళ్లతో ‘మోటార్ శకటాన్ని’ గొట్టాం పెట్టి కడిగితే అక్కడ ‘ఫైన్’ అనరు. ‘ఫైన్’ అంటే జరిమానా వేస్తారు- ఏకంగా రెండు వేల రూపాయలు వడ్డిస్తారు. ఏటా అక్కడ కొంతకాలంగా ఎండాకాలం ఆంక్షలు ఉన్నా అవి అంతంతమాత్రం అమలు చేస్తున్నారు. కాని రుూ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా ఆంక్షలు అమలులో వుంటాయి. బాబూజీలు- సంపన్నులు వుండే ప్రాంతాలతో సహా యిటువంటి నియమాల ఉల్లంఘనల్ని నిరోధించేటందుకు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం ఇరవై ‘స్క్వాడ్’లను వేసింది. ఉదయం అయిదున్నర గంటలనుంచి తొమ్మిదిన్నర గంటలదాకా ఇండ్ల ముందు రుూ ‘దుబారా జల విన్యాసా’లకు స్వస్తి చెప్పాల్సిందే లేదా చలాన్ యిస్తారు. ఒక్కసారిగా రెండు వేల రూపాయల జరిమానా చేశారిప్పుడు కదా, అక్కడే కట్టు లేదా నీటి మీటరు బిల్లుతో పంపుతాం, కట్టు అన్నాడు మేయర్‌గారు. చండీఘడ్ నగరానికి రోజూ పదకొండు కోట్ల డెబ్భై లక్షల గ్యాలన్‌ల నీరు అవసరం వుండగా 8 కోట్ల 70 లక్షల గ్యాలన్‌ల నీరు సప్లయి వుంటూంది. పైగా రెండు కోట్ల గ్యాలన్‌ల ‘లీకేజీ’ వుంటుంది. దీనివల్ల 10 కోట్ల రూపాయల నష్టం కలుగుతోంది. పైగా ఇది ‘ఆదా’ అయితే 48,000 యిండ్లకి ‘సరఫరా’ చేయొచ్చును అంటూ కార్పొరేషన్ పబ్లిక్ నోటీసులు ఇచ్చింది. మోటారు కార్లను బకెట్ నీటితో కడగాలి. ప్రొద్దునే్న లాన్‌లు, ఆవరణ రోడ్డులు, వరండాలు తడపరాదు. ట్యాంకులు ‘ఓవర్ ఫ్లో’ కాకుండా, గొట్టాలకు లీకేజీ లేకుండా మీటర్ సరిగా పనిచేసేలాగా రోజూ చూసుకోవాలి. లేదా ‘కట్’. బూస్టర్ పైపులు సమ్మర్‌లో వాడరాదు అంటూ చెకింగ్ టీములు తెగ తిరుగుతున్నాయి. చలాన్ వసూళ్లు సాగుతున్నా, టీములకు చెయ్యి తడిపేవారు కూడా వున్నారని ‘కార్పొరేషన్’ అధికార్లు వాపోతున్నారు. షరా మామూలేగా!
భార్యాభర్తల ‘మొబైల్ చిచ్చు’
నా ‘మొబైల్’ నా ప్రాణం. సెల్ఫీలే నాకు నిత్య నూతనానందం అన్నట్లుగా తయారైపోయారు. హైటెక్ ఉద్యోగాలు చేస్తున్న మొగుడు పెళ్లాలు ఏమైనా అడుగు కాని మొబైల్ ఒక్కటీ అడగకు అంటున్న భార్య దగ్గరనుంచి ఫోను లాక్కుని నొక్కి చూస్తున్న భర్తమీద బంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ యింజనీరమ్మాయి వంట యింటి కత్తితో ‘నీ వేళ్లు నరికేస్తా’నంటూ దాడిచేసింది. వాళ్లిద్దరూ చంద్రప్రకాశ్, సునీత. ఇద్దరూ బీహార్‌నుంచి వచ్చి బంగుళూరులో కలకొండనహళ్లీ అనే ‘పోష్’ ఏరియాలో కాపురం వుంటున్నారు. వేర్వేరు ఐ.టి కంపెనీల్లో లక్ష రూపాయలదాకా జీతాలు లాగుతున్నారు. ఈమధ్య ఆమె ఉద్యోగం మానేసింది. మరో ఉద్యోగం చేరేదాకా యింట్లోనే ‘హవుస్ వైఫ్’ పాత్ర నిభాయిస్తోంది. ఒక చేత గరిట మరో చేత ‘మొబైల్ ఫోను’ అట్టుకుని కాలక్షేపం చేస్తోంది.
మే 4న రాత్రి 11 గంటలకి చంద్రప్రకాష్ కొంపకి చేరాడు. భార్య మొబైల్ లోకంలో మునిగిపోయి వుంది. ఈ లోకంలోకి లాగి ‘్ఫడ్’ లేదా అని ఇలా సైగ చేశాడు. ‘మొబైల్’ని అట్టే వుంచుకుని ‘‘వండలేదు డాళింగ్! ఆన్‌లైన్ ఆర్డర్ చేశా.. డోంట్ డిస్టర్బ్‌మీ. అటు తలుపుకేసి చూస్తూండూ..’’ అంటూ సునీత మళ్లీ సెల్ టాక్‌లో మునిగిపోయింది. ‘ఆకలి కోపం’ వచ్చేసింది మొగుడి పక్షిగాడికి. ఆ మొబైల్ లాక్కుని చెంపమీద ఛెళ్లున ఓ దెబ్బ వేశాడు. ఏమిటో ఈ ఫోను పిచ్చి. దీనిలో ఏమి గొప్ప కాల్స్, సందేశాలు వున్నాయో అంటూ ఫోన్ బటన్స్ నొక్కసాగాడు. ఆమెకి ‘పూనకం’ వచ్చింది. ‘‘నా మొబైల్ తెరుస్తావా.. నీ వ్రేళ్లు నరికివేస్తానేమనుకుంటున్నావో?’’ అంటూ వంట యింట్లోకి దూరి నిజంగానే కత్తి పట్టుకొని వచ్చి కలియబడింది మొగుడిమీద. ఆ కోపంలో అతని వేళ్లు ఆ కత్తిపెట్టి చెక్కేసింది. పెళ్లాం చేతి ‘ముద్ద మ్రింగాలనుకున్న’ టెక్కీ రక్తం కారుతున్న తన చేతిని అదిమి పట్టుకుని క్రిందకు పరుగులు తీశాడు. నేరుగా ఆసుపత్రికి పోయి ‘డ్రెస్సింగ్’ చేయించుకున్నాడు.
భార్యాభర్తలు యిద్దరిమధ్య కలహం కక్షగా మారింది. పరస్పర దాడుల్లో ఆమెదే పైచెయ్యి. దాంతో మగడు పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తాడు. ‘‘నాకు రక్షణ కావాలి మహాప్రభో!’’ అంటూ.
భార్య కూడా కేసు పెట్టింది. ‘‘నా స్వేచ్ఛని హరించి నన్ను హింసిస్తున్నాడు’’ అంటూ.
పోలీసులు యిరుకున పడ్డారు. అతని చెయ్యి చూస్తే అంతా కట్టే వుంది. పాపం! లోపల వేళ్లు నజ్జు నజ్జు అయ్యాయిట. వాళ్ల అమ్మా నాన్నలని పిలిపించారు ‘‘రుూ యువజంట అన్యోన్యతని చూడమని’’ పోలీసులు.
బీహారునుంచి వచ్చిన ఆ పేరెంట్స్ రుూ మొబైల్ వార్‌లో సంధి కుదర్చాలని చూస్తున్నారు. వారి కర్మ ఎలా వుంటుందో? జంటలారా! జరభద్రం!
మొత్తం కుటుంబం జైల్లో!
అందరికీ శకునం చెప్పే బలి కుడితి కుండలో పడ్డది అన్నట్లు- మంత్రులే జైలుగాలి తినాల్సి వస్తున్న రుూ రోజుల్లో బీహార్ జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన ఎమ్‌ఎల్‌సి శ్రీమతి మనోరమాదేవి మీద అరెస్టు వారెంట్ వున్నది కాని ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఐతే మొన్న మంగళవారం యిక తప్పదనుకొని గయా కోర్టులో లొంగిపోయింది. పధ్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి వేశారు. ఆమె జైలుకి చేరగానే తన భర్త బిందీయాదవ్ (హిస్టరీ షీటరు, కాంట్రాక్టరు) కూడా జైలులోనే పోలీసు కస్టడీలో వున్నాడు. సరే వీరి పుత్ర రత్నం రాకీయాదవ్ బాబు తన కారును ఓవర్‌టేక్ చేసినందుకు ఒక పనె్నండో తరగతి విద్యార్థి ఆదిత్య సచిదేవ్ కారుని వెంటాడి కాల్పులు చేసి చంపివేసిన నేరానికి నిందితునిగా అరెస్టు అయి వున్నాడు. ఈ సుపుత్రుని కారణంగానే తండ్రి అంత పెద్ద ‘క్రిమినల్ లీడర్’ అయివుండీ అరెస్టు అయినాడు. పోలీసులు రాకీ ఎక్కడున్నాడో? ఆరా తీస్తూ ఎమ్‌ఎల్‌సి మనోరమాదేవిగారి విలాస గృహంపై కూడా సెర్చ్ వారంట్‌తో దాడి చేశారు. అక్కడ రాకీ లేడు గాని కొన్ని మద్యం సీసాలు దొరికాయి. దేశవాళీ- విదేశీ మందు సీసాలు ఇంట పెట్టుకున్న నేరంపై ఆమెను అరెస్టు చేయబోగా ఆమె అదృశ్యం అయింది. చివరికి ఈ ముగ్గుర్ని కూడా నితీష్‌కుమార్‌గారి ఆదేశాల మీద పోలీసులు వేటాడి పట్టుకోగలిగారు. జైల్లో కలిశారు. ఈలోగా జెడియూ పార్టీ మనోరమాదేవిని సస్పెండ్ చేసింది. ‘మందు’ బాటిల్స్ విషయంలో బీహార్ ముఖ్యమంత్రి చాలా స్ట్రిక్టు అని తెలుసుగా. మనోరమాదేవి ‘‘ఆ బాటిల్స్ నావి కావు. భా.జ.పా వాళ్లు తెచ్చిపెట్టారు’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. మొత్తంమీద ‘సుపుత్రా కొంప పీకరా’ అన్నట్లు అయింది.
నాన్నగారి పద్యాలే అతని ‘గీత’!
‘‘పనామా లీక్సు’’ తరువాత చిక్కుల్లో పడ్డ అమితాబచ్చన్ నిత్యం తన తండ్రి హరివంశ్‌రాయ్ బచ్చన్ రాసిన పద్యాలు పఠిస్తున్నాడు. అమితాబ్ తండ్రి సుప్రసిద్ధ హిందీ కవి, హరివంశ్‌రాయ్ బచ్చన్‌గారు 2003లో కీర్తిశేషులైనారు. ‘అగ్నిపీఠ్’, ‘మధుశాల’ లాంటి ఆధునిక పద్యకావ్యాలను ఆయన రచించాడు. నాన్నగారి పద్యాలు నిత్యం పారాయణ చేస్తే నాకు మనోనిబ్బరాన్ని కలిగిస్తాయి. నా కష్టాలు గట్టెక్కుతాయ్ అన్న ధైర్యం వస్తుంది అంటూ సూపర్‌స్టార్ తన ‘బ్లాగు’లో రాసుకున్నాడు. అవధి (హిందీ) భాషలో రాసిన భగవద్గీతను కూడా అమితాబ్ పారాయణ చేస్తున్నాడట. ‘జనగీత’ అని పేరు పెట్టారు దీనికి! రాత బాగుంటే గీత కాపాడుతుంది కదా!

-వీరాజీ