Others

నడుమునొప్పి వేధిస్తోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది మహిళల్లో నడుమునొప్పి రావడం సహజమే అయినప్పటికీ అందుకు దారితీస్తున్న కారణాలేమిటో తెలుసుకుని నివారణ చర్యలు ఆచరించాలి. ఇంటిపని ఎక్కువైతే ఆడవారిలో నడుము నొప్పి సమస్య తీవ్రమవుతుంది. పని ఒత్తిడి వల్లనే కాదు, గర్భాశయం, గర్భాశయ ద్వారం వంటి శరీర భాగాలపై ఇన్‌ఫెక్షన్ సోకినా నడుము నొప్పికి దారితీస్తుంది. మూత్రనాళం ఇన్‌ఫెక్షన్‌కి గురైనపుడు, రుతుక్రమం ఆగిపోవటం వంటి సందర్భాలలోనూ ఆడవారు నడుమునొప్పితో బాధపడుతుంటారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీని నుంచి ఉపశమనం పొందే వీలుంది.
- ఇంట్లోనే సులువైన యోగాసనాలు వేస్తూంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.
- కాల్షియం పుష్కలంగా ఉండే పాలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్, చేపలు, మాంసం వంటివి తీసుకోవాలి.
- ఏ పనిచేస్తున్నా సరైన భంగిమలను పాటిస్తే నివారణ వుంటుంది.
- వయసు పెరిగేకొద్దీ ఎక్కువ బరువున్న వాటిని ఎత్తటం చేయకుండా జాగ్రత్తపడాలి. వయసు పెరిగే కొద్దీ వెనె్నముకలోని పూసలు, డిస్కులు అరగటం, జారటం జరుగుతుంది.
- తగిన వ్యాయామం చేస్తుంటే వీపు కండరాలకు, పొత్తికడుపు కండరాలకు మంచిది. ఈ కండరాలను గట్టిపరచుకుంటే నడుము భాగం బలంగా ఉంటూ ఇబ్బందులేవీ దరిచేరవు.

-మనస్విని