AADIVAVRAM - Others

మెరుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవంబర్ నెల ఉదయం తొమ్మిది గంటల సమయం. ఎండ తాకితే హాయిగా ఉంటుంది. మా ఆవిడ ఊరికి వెళ్లాల్సి వచ్చింది. కారులో ఆవిడని బస్టాండ్‌కి తీసుకొని వెళ్లాను. దార్లో టిఫిన్ చేశాం. టిఫిన్ చేసి బయటకు వస్తుంటే ఎవరో ముసలావిడ డబ్బులు అడుగుతూ కన్పించింది. ఆవిడ ప్రార్థనని ఏ మాత్రం పట్టించుకోకుండా కారు తీసుకొని బస్టాండ్‌కి పరుగు తీశాం.
ఆవిడని పంపించి తిరిగి వస్తున్నప్పుడు అదే టిఫిన్ సెంటర్ కన్పించింది. ఎర్రలైటు పడటంతో అక్కడ ఆపాల్సి వచ్చింది. అదే ముసలావిడ అక్కడ మళ్లీ కన్పించింది. యాభై సంవత్సరాలు దాటిన ఓ మహిళ ఆమె దగ్గరకు వచ్చి రెండు ఇడ్లీలు, ఓ పది రూపాయలు ఇచ్చింది. ఆ ముసలావిడ కళ్లల్లో మెరుపు మెరిసింది.
ఆ మెరుపు నన్ను విపరీతంగా ఆకర్షించింది. ఆ మెరుపుకి నేను కారణం కాలేదని అప్పుడు అన్పించింది. ఎర్రలైటు పోయి గ్రీన్‌లైట్ పడినట్టుంది. నేను గమనించలేదు. వెనుక నుంచి ఎవరో హారన్ కొడుతున్నారు. ఉలిక్కిపడి కారును ముందుకు నడిపించాను. ఓ చిన్న ప్రేమపూర్వకమైన కరుణ నా దృష్టిని ఆకర్షించింది. గ్రీన్‌లైట్ పడిన విషయాన్ని గమనించనంతగా నా దృష్టిని ఆకర్షించింది. ఇంటికి తిరిగి వస్తుంటే ఆకాశం ఇంకా ప్రకాశవంతంగా అన్పించింది. స్వర్గానికి, భూమికి మధ్య దూరం తగ్గినట్టు అన్పించింది.
అలాంటి మంచి పనిని ఎంపిక చేసుకోవడం చాలా శక్తివంతమైంది. అది హృదయాన్ని తాకుతుంది. జీవితాన్ని కూడా మార్చవచ్చు. భగవంతునికి దగ్గర చేస్తుంది.
ఇలాంటి మంచి పని చేయడానికి మనకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. వాటిని మనం ఉపయోగించుకోం. ఎదుటి వ్యక్తిలో ఓ చిన్న నవ్వుని, వాళ్ల కళ్లల్లో ఓ చిన్న మెరుపుని చూపించడంలో అనిర్వచనీయమైన ఆనందం ఉంది.