ఈ వారం తార

దటిజ్‌ సమంత...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్లవార్లూ వెనె్నల్లో తలారా స్నానం చేసిన నందివర్దనం నచ్చకుండా ఉంటుందా? రంగుల్లేనంత మాత్రాన.. బ్లాకింక్‌తో ఎంఎఫ్ హుస్సేన్ గీసిన హార్స్ పెయింటింగ్ ఆకట్టుకోకుండా ఉంటుందా? ఆకాశం నుంచి రాలిపడుతూ క్షణంపాటు కళ్లలో మెరిసిన ఉల్కాపాతాన్ని మళ్లీ చూడాలని అనిపించదా? నిజానికి -వీటితో మనకు సంబంధం ఉండదు. భౌతికంగానూ మన ప్రమేయం ఉండదు. కానీ -చిన్న ఫీల్. ఎక్కడో ఇష్టం.. ఇష్క్.
అభిమానులకు శామ్స్ కూడా అంతేనట. ఆమె అందం, సక్సెస్‌ఫుల్ కెరియర్‌ని చూసో కాదు, బిహేవియర్‌కీ ఫిదా అయిపోయి, ఫీల్‌కి గురవుతామంటున్నారు ఫ్యాన్స్.

బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్‌కి ముందే రెండు గ్రూప్ సాంగ్స్ ప్రోమోలను ట్వీట్ చేసింది కాజల్ అగర్వాల్. మిగిలిన పాటలనూ ట్వీట్ చేస్తుందని ఆశగా చూశారు ఫ్యాన్స్. కానీ అలా జరగలేదు. ఎందుకంటే -ఆ సాంగ్స్‌లో శామ్స్ కూడా తళుక్కుమంటుంది మరి. అది కాజల్ ఇమేజ్‌కు ప్రాబ్లెమ్. అందుకే కామ్‌గా ఊరుకుంది. కానీ -ఆడియో రిలీజ్‌లో శామ్స్ మాత్రం తన గోల్డెన్ బిహేవియర్‌తో ఆకట్టుకుందట. స్టేజ్‌పై మాట్లాడుతూ.. చిత్రంలో మహేష్ తరువాత ఇంకో ఇద్దరు అందమైన అమ్మాయిలున్నారు అని నవ్వేస్తూ.. కాజల్, ప్రణీతలకు ఆల్ ది బెస్ట్ అందట. అంతే శామ్స్ స్పోర్టివ్‌నెస్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సోషల్ నెట్‌వర్క్ సైట్స్‌లో ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.
నిజానికి బృందావనం రిలీజ్ టైంకి కాజల్ టాప్ హీరోయిన్. సమంత అప్‌కమింగ్ హీరోయిన్. ఇప్పుడు సీన్ రివర్సయ్యింది. అయితే, శామ్స్ టాప్ రేంజికి చేరుకున్నా -పబ్లిక్‌లో ‘అలాంటి’ బిహేవియర్‌కు దూరంగానే ఉంటుందన్నది ఫ్యాన్స్ మాట. దాదాపు టాప్ హీరోలందరితో కెమిస్ట్రీలో టాప్ అనిపించుకున్న శామ్స్ -ఇటు యంగ్ హీరోలతోనూ ప్రాజెక్టులు ఓకే చేస్తోంది. మహేష్‌తో బ్రహ్మోత్సవం చేస్తూనే.. నితిన్‌తో ‘అఆ’ కంప్లీట్ చేసింది. సాయిధరమ్‌తో జోడీ కట్టేందుకు నర్మగర్భంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత, తమిళంలోనూ మరో అప్‌కమింగ్ హీరోతో ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చిందట. సో.. -కెరియర్‌ను బ్యాలెన్స్‌డ్‌గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తోందన్న మాట. తన కెరియర్ అరేబియన్ గుర్రంలా దూసుకెళ్తోందన్న ఆనందాన్ని ఇలా చెప్పకనే చెప్తోంది శామ్స్.