AADIVAVRAM - Others

టెలివిజన్ బ్రహ్మ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టీవీలు లేని ప్రపంచాన్ని ఊహించలేము. ఆ టెలివిజన్ సృష్టించిన వాడు అపరబ్రహ్మ ‘బెర్ట్’ మహాశయుడు. 1888లో స్కాట్లండ్‌లోని హెలెన్స్ బర్గ్ అనే చిన్న పట్టణంలో బెర్ట్ జన్మించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బెర్ట్ చిన్నతనం నుండీ ప్రయోగాలు, పరిశోధనలు అంటే ఎక్కువ ఆసక్తి చూపించేవాడు.
అతని చిన్నతనంలో టెలిఫోన్ కనిపెట్టిన గ్రాహంబెల్ గురించి, రేడియో కనిపెట్టిన మార్కొని గురించి ఆసక్తిగా చదివి, స్ఫూర్తి పొందేవాడు. పాఠశాల చదువు అనంతరం గ్లాస్గో యూనివర్సిటీలోని రాయల్ టెక్నికల్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో చేరాడు బెర్ట్. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంజనీర్‌గా చేరాడు. కానీ తీవ్రమైన అనారోగ్యం వలన అతన్ని ఉద్యోగంలోంచి తొలగించారు. చేయగలిగింది ఏమీ లేక తన అనారోగ్యాన్ని నిందించుకుంటూ ఇంటి దగ్గరే కూర్చొని తన చిన్ననాటి కోర్కె అయిన టెలివిజన్ పరిశోధనలను ప్రారంభించాడు.
ఇంగ్లండ్‌లోని హేస్టింగ్స్ ప్రాంతంలో ఒక చిన్న వర్క్‌షాప్ తెరచి తన పరిశోధనలు కొనసాగించాడు. తన పరిశోధనలకు ఆర్థిక సాయం చేయవలసిందిగా స్థానిక పారిశ్రామికవేత్తలను కోరాడు. ఎవ్వరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. బెర్ట్ చేసిన తీవ్ర ప్రయత్నాలతో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వారు సహాయం చేయడానికి అంగీకరించారు.
1925లో బెర్ట్ తన ప్రయోగాలు తీవ్రతరం చేసి ‘టెలివిజన్ లిమిటెడ్’ అనే సంస్థను స్థాపించాడు. 1928లో మొట్టమొదటిసారిగా లండన్ నుంచి న్యూయార్క్‌కు టెలివిజన్ సందేశం పంపాడు. ఆ తర్వాత 1929 సెప్టెంబర్ 20న సర్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ ప్రసంగాన్ని టెలివిజన్‌లో ప్రసారం చేశాడు. దాని కోసం 30 సెట్లను తయారుచేసి వివిధ ప్రాంతాలలోని పత్రికల వారికి, శాస్తవ్రేత్తలకు, ప్రముఖులకు, రాజకీయ నాయకులకు చూపించి ప్రపంచం యావత్తూ నివ్వెరపోయేలా చేశాడు.
టెలివిజన్ కనిపెట్టి అంతటితో తృప్తిపడక కలర్ టెలివిజన్, స్టీరియోఫోనిక్, త్రీడీ టెలివిజన్‌లపై గొప్ప పరిశోధనలు చేసిన బెర్ట్ మహాశయుడు అనారోగ్యంతో 1946లో మరణించాడు. టీవీ ప్రసారాలలో ఇప్పటి పెనుమార్పులకు మూలకారకుడు అపరబ్రహ్మ బెల్ట్ మహాశయుడు.

-పి.వి.రమణకుమార్