AADIVAVRAM - Others

రేడియో తరంగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుదయస్కాంత శక్తి యొక్క గుణాన్ని గురించి ఆలోచించిన మొదటి వ్యక్తి స్కాట్లండ్‌కు చెందిన శాస్తజ్ఞ్రుడు జెమ్స్‌క్లార్క్ మాక్స్‌వెల్. ఆయన రూపొందించిన సమీకరణాలు, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల యొక్క లక్షణాలను మరియు పదార్థంతో వాటి యొక్క పరస్పర ప్రభావాన్ని వివరించాయి. విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలు, ఒక స్థిరమైన చలన వేగంతో ఖాళీ ప్రాంతం గుండా ప్రయాణిస్తాయని ఆయన సిద్ధాంతీకరించాడు. కాంతి తరంగాలు మరియు రేడియో తరంగాలు, విద్యుదయస్కాంత ధార్మిక శక్తి యొక్క రెండు రూపాలుగా కూడా ఆయన ప్రతిపాదించాడు.
1888లో జర్మనీ శాస్తవ్రేత్త హైన్‌రిచ్ హెర్ట్‌జ్, రేడియో తరంగాల ఉనికిని రుజువు చేయడం ద్వారా అతడు, మాక్స్‌వెల్ యొక్క సిద్ధాంతానికి సంతృప్తికరంగా ప్రదర్శించిన ప్రథమ వ్యక్తిగా నిలిచాడు. అధికమైన ఫ్రీక్వెన్సీ మరియు అంతకన్నా మించిన ఫ్రీక్వెన్సీ గల రేడియో తరంగాలను కనుగొనగల ఒక పరికరాన్ని తయారుచేసి, దాని ద్వారా ఇది రుజువు పరిచాడు హెర్ట్‌జ్. ఆయన తను సాధించడానికి ‘ఎలక్ట్రిక్ వేవ్స్’ అన్న పుస్తకంలో ప్రచురించాడు. రోదసి గుండా విద్యుత్ చర్య, పరిమితమైన చలన గమనంతో ప్రయాణించటానికి సంబంధించిన పరిశోధనలు వ్యాప్తి చెందుతూండగా, ఈ పరిశోధనలు విద్యుదయస్కాంత ప్రసారాన్ని వ్యాప్తి చెందేందుకు గొప్పగా సహాయపడ్డాయి. మరియు ఈ రంగంలో గల ఇతర శాస్తజ్ఞ్రులు ఈ పరిశోధనల ఆధారంగా అటు తర్వాత హెర్ట్‌జ్ ఏంటెన్నా రిసీవర్‌ను రూపొందించారు.
వివిధ రకాల పదార్థాల గుండా రేడియో తరంగాలను ప్రసరింపజేయవచ్చని హెర్ట్‌జ్ కనుగొన్నా, ఇతరులపై కూడా ఈ ప్రభావం ప్రతిబింబించింది. ఈ ఆవిష్కారం రాడార్ ఆవిష్కారానికి నాంది పలికింది. ఆయన పరిశోధనల ప్రాముఖ్యతను ఆ కోణంలో గుర్తించకపోయినా, వైర్‌లెస్ కమ్యూనికేషన్‌కు కూడా అవే మార్గదర్శకాలయ్యాయి.
ఆయన చేసిన ఈ విజ్ఞాన పరిశోధనా సేవలకు గుర్తింపుగా ఆయన పేరును 1933వ సం. నుండి, అంతర్జాతీయ కాల ప్రమాణంలో ఒక భాగంగా అధికారికంగా నిర్ణయించబడింది. ఈ పదాన్ని రేడియో మరియు విద్యుత్ ఫ్రీక్వెన్సీలకు ప్రమాణం (యూనిట్)గా ఉపయోగిస్తారు.

-బి.మాన్‌సింగ్ నాయక్