AADIVAVRAM - Others

ఇసుక తినె్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో 99 శాతం ఇసుక తినె్నలు ఎడారుల్లో ఉంటాయి. కొంచెం మొక్కలు, గాలి ఉంటే చాలు ఇవి ఎక్కడైనా ఏర్పడతాయి. రాళ్లు, మొక్కల గుబుర్లు వున్నా ఇసుక అక్కడ పేరుకుపోతుంది. సముద్ర తీరాలు, ఎండిపోయిన సరస్సులు, నదుల మధ్య భాగాల్లో ఇసుక మేటలు వేసుకుంటుంది. ఇసుక తినె్న ఏర్పడినప్పుడు దానిలోనికి గాలి ద్వారా మరిన్ని ఇసుక రేణువులు వచ్చి చేరతాయి. 95 శాతం ఇసుక రేణువులు గాలికి కొన్ని సెంటిమీటర్ల వరకు కదులుతాయి. సన్నటి ఇసుక రేణువులు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి వీటికి కదిలే గుణం ఎక్కువ. ఇసుక తినె్నలు గరిష్ట స్థాయికి పెరిగిన తర్వాత గాలి పోటు ఎక్కువగా ఉంటుంది. ఆ ఎత్తులో గాలి గట్టిగా ఢీకొనడం వల్ల ఉపరితల పైకప్పు అప్పుడప్పుడు తగ్గిపోతూ ఉంటుంది.
ఇసుక తుపాన్లు 300 కిలోమీటర్ల వరకు దుమారాన్ని రేపగలవు. వెడల్పు గరిష్టంగా 500 మీటర్లు ఉంటాయి. చిన్న ఇసుక దుమారాలు 5 మీటర్ల లోపే ఉంటాయి. వర్షాలు పడినప్పుడు ఇసుక తినె్నల్లో కదలికలు తక్కువగా ఉంటాయి. ఎండాకాలంలో ఇసుక రేణువులు అదే పనిగా కదులుతూ ఉంటాయి. ఇసుక తినె్నలు పెరగకుండా కదలకుండా ఉండాలంటే మొక్కలను పెంచాలి.

-నాయక్