Others

మహిళా నేతల కలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలటం సహజం. కాని ఆ మాటలు వ్యక్తిగత విషయాలపైకి వెళితేనే అతివలకు అవమానకరంగా ఉంటాయి. సినీ గ్లామర్ నుంచి వచ్చిన మహిళలంటే మరీ చులకన. గతంలో సినీ నటి జయ్రపద బొమ్మను అసభ్యకరంగా చిత్రీకరించి ఆమెను కన్నీటి పర్యంతం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో పాటు పురుష దురంహకారం అనే పైత్యం కూడా ప్రకోపించినట్లు ఉంది. వామపక్ష ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఇటీవలనే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన రేజ్జాక్ మోల్లా బిజెపి అభ్యర్థి రూపా గంగూలీపై చేసిన కామెంట్‌పై మహిళా లోకం ఆక్రోశం వెళ్లగక్కుతోంది.‘ మిస్సెస్ గంగూలీ మహాభారత్ టీవి సీరియల్‌లో ద్రౌపది పాత్ర పోషించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. తెర వెనుక ఆమె సిగరెట్లు కాలుస్తుందని, ఆమెకున్న వ్యక్తిగత సంబంధాలను పేర్కొంటూ నిజంగానే ద్రౌపది వంటిదే’ అని నిండు సభలో ఎగతాళి చేశారు. ఇలాంటి విష ప్రచారం వల్ల ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచటమే. సిగరెట్లు తాగే అలవాటు అనేది దురలవాటు. అది స్ర్తికైనా, పురుషుడికైనా ఆరోగ్యానికి మంచిది కాదు. పురుషుడు తాగితే ఫరవాలేదు. స్ర్తి తాగితే అదేదో ఆమె శీలానికి సంబంధించిన విషయంగా పరిగణించటం ఎంతవరకు సమంజసం అని స్ర్తివాదులు ప్రశ్నిస్తున్నారు. వామపక్ష భావజాలంతో పైకొచ్చిన ఈ రెజ్జాక్ మోల్లా ఆది నుంచి కూడా మహిళలపై అసందర్భ ప్రేలాపనలు చేయటం అలవాటుగా మారింది. గత ఎన్నికలపుడు కూడా ఈయన ప్రఖ్యాత సినీ నటి మూన్ మూన్ సేన్‌పై విషం చిమ్మారు.
తృణమూల్ కాంగ్రెస్‌లో గ్లామర్‌ను పెంచేందుకే మూన్ మూన్ సేన్‌కు మమత టిక్కెట్టు ఇచ్చిందని, ఆమె దేశానికి ఏమి చేసిందని ఎద్దేవా చేశారు. ఈసారి రూపా గంగూలీపై కామెంట్స్ చేశారు. దీనిపై ప్రత్యర్థి గంగూలీ మాట్లాడుతూ.. మమత బెనర్జీ రాష్ట్రంలోని మహిళల కోసం ఏమి చేయటం లేదనేదానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని వ్యాఖ్యానించారు. ప్రముఖ స్ర్తివాది, నటి అపర్ణాసేన్ దీక్షిత్ దీనిపై మాట్లాడుతూ మోల్లాకు జరిమానా విధించటం ద్వారా మమత మహిళల హక్కు లు కాపాడాలని డిమాండ్ చేశారు. మహిళలపై పనిగట్టుకుని ఇలాంటి దుష్ప్రచారం చేసే పురుషాధ్యిక నేతలు ఉన్నంతకాలం మహిళా లోకం కలవరానికి గురవుతోంది. ఓ వైపు రాజకీయంగా ఎదగాలంటూనే ఇలాంటి అగ్నిజ్వాలలు ఎగదోస్తుంటే అతివలు ఎలా అడుగు ముందుకు వేయగలరు..?