Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా హీరోనిబట్టి కలక్షన్లు వస్తున్నాయా? సినిమాలో దమ్మునిబట్టి కలక్షన్లు వస్తున్నాయా? అన్న అనుమానం ఈవారం అటు స్టార్ హీరోలకు పరిశ్రమలో వున్న వారికి తెలిసొచ్చింది. ఈవారం విష్ణు, రాజ్‌తరుణ్ కథానాయకులుగా ‘ఈడోరకం ఆడోరకం’, తమిళంనుండి వచ్చిన విజయ్ ‘పోలీస్’ చిత్రాలతోపాటుగా తెలుగులో రూపొందించిన చిన్న చిత్రాలు ‘ముసుగు’, ‘్ధనాధన్’, ‘లవ్ చేయాలావద్దా’అనే సినిమాలు తమ అదృష్టం పరిక్షించుకోడానికి విడుదలయ్యాయి. ఈ చిత్రాల్లో ఈడోరకం ఆడోరకం సినిమా సరైన టాక్ లేక కలక్షన్లు రాబట్టడంలో వెనకబడింది. పోలీస్ చిత్రం కూడా సోసోగా సాగుతోంది. ఇక మిగతా ముసుగు, ధనాధన్, లవ్‌చేయాలావద్దా చిత్రాల గురించి పట్టించుకునేవారు లేరు. గత వారం విడుదలైన సర్దార్ గబ్బర్‌సింగ్‌కు కలక్షన్లు పూర్తిగా తగ్గిపోగా, ఊపిరి థియేటర్లు పెంచుకుని స్టడీగా నిలిచి కలక్షన్లను రాబడుతోంది. షారుక్‌ఖాన్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయంతో వచ్చిన ఫాన్ పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లు రాబడుతోంది. రెండు పాత్రల్లో అభినయానికి బాక్సాఫీస్ గలగలలాడుతోంది.