AADIVAVRAM - Others

ప్రముఖ శాస్తవ్రేత్తలు రాడాల్ఫ్ డీజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాడాల్ఫ్ డీజిల్ 1858లో పారిస్ నగరంలో జన్మించాడు. తల్లిదండ్రులిద్దరూ జర్మనీ నుంచి వలస వచ్చి ఫ్రాన్స్‌లో స్థిరపడిన వారే. పాఠశాలలో డీజిల్ మిగతా విద్యార్థులకన్నా ఉత్సాహంగా ఉంటూ, ఉపాధ్యాయుల అభిమానాన్ని చూరగొన్నాడు.
ఇంజనీరింగ్ చదువుతూండగా 1870లో ఫ్రాంకోప్రషన్ యుద్ధం సంభవించింది. ఆ గొడవల్లో డీజిల్ కుటుంబం రాత్రికి రాత్రే ఇంగ్లండ్‌కి ప్రయాణం కట్టింది. డీజిల్ దూరపు బంధువు అతనిలోని ఆసక్తిని గమనించి తల్లిదండ్రుల్ని ఒప్పించి, చదువు నిమిత్తం జర్మనీ తీసుకెళ్లాడు. డీజిల్ జర్మనీలో మ్యునిచ్ టెక్నికల్ యూనివర్సిటీలో చేరాడు. చాలా కష్టాలు పడి యూనివర్సిటీలో ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణుడయ్యాడు.
ఆ కాలంలో ఫ్యాక్టరీలలో, రైళ్లలో, ఓడలలోని యంత్రాలు ఆవిరి ద్వారా లేదా పెట్రోలు ద్వారా పనిచేసేవి. రెండూ కూడా ఖరీదైనవే. చిన్నచిన్న యత్రాలతో పని చేసుకునే కార్మికులు కూడా ఆవిరి ఉత్పత్తి చేయడానికి భారీ పరికరాలను వినియోగించటం జరిగేది. దాని వలన వారంతా విపరీతంగా నష్టపోయేవారు. ఆ విషయం గ్రహించిన డీజిల్, ఆ యంత్రాలకు పనికివచ్చే ఒక ఇంధనం కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తాను కనిపెట్టే ఆయిల్ వలన యంత్రం వేగంగా వెంటనే పనిచేయడమే కాక, అందులోని పరికరాలు ఆయిలింగ్ అయ్యి మృదువుగా పని చెయ్యాలి అనుకుని 1885లో పరిశోధనలు ప్రారంభించాడు. అలా మూడు సంవత్సరాలపాటు అనేక ప్రయోగాలు చేశాడు.
దీపావళి బాణాసంచా పేలుడు లాంటి శబ్దం చేసే పదార్థాలను అతడే కనుగొన్నాడు. ఆ పేలుడు పదార్థాలు అనేక దేశాలలో అనేక మార్పులతో ఇప్పటికీ వినియోగించడం విశేషం. మరో నాలుగు సంవత్సరాలపాటు పరిశోధనలు చేసి చివరికి ‘డీజిల్ ఆయిల్’ను కనిపెట్టాడు. అతి తక్కువ ఖర్చుతో ఆయిల్ వినియోగంలోకి రావడంతో డీజిల్ తన పేరుతోనే ఆ ఆయిల్‌ను చెలామణి చేసుకున్నాడు.
కొద్దికాలంలోనే డీజిల్ కోట్లకు పడగలెత్తాడు. తనతోపాటు కొన్ని వేల మందిని కోటీశ్వరులను చేశాడు. 1912లో బ్రిటీష్ ప్రభుత్వం ఆహ్వానంపై డీజిల్ ఇంగ్లీష్ ఛానల్ మీదుగా ప్రయాణం చేస్తుండగా దురదృష్టవశాత్తూ మార్గమధ్యంలో ఓడ మునిగిపోయి డీజిల్ చనిపోయాడు.
ఆయన మరణించినా డీజిల్ ఆయిల్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా చిరస్మరణీయంగా వెలిగిపోతూనే ఉన్నాడు.

-పి.వి.రమణకుమార్