AADIVAVRAM - Others

మైకేల్ ఫేరడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైకేల్ ఫేరడే 1791వ సం.లో లండన్ సమీపంలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. తండ్రి కమ్మరి పని చేసేవాడు. కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు.
ఫేరడీకి విపరీతమైన నత్తి ఉండేది. చాలా పదాలు ఉచ్ఛారణ దోషం లేకుండా పలుకలేడు. మనోధైర్యంతో బాగా మాట్లాడటానికి కృషి చేసేవాడు. చదువు పట్ల ఆసక్తి కనబరచేవాడు. తండ్రి అతన్ని స్కూల్లో చేర్పించాడు. అక్కడ తోటి పిల్లలు అతన్ని బాగా గేలిచేసేవారు. ఎవరెంతగా గేలి చేసినా, ఆట పటిటంచినా ఫేరడే మాత్రం చలించలేదు. దేనికైనా సమయం రావాలి అనుకుంటూ చదువు విషయంలో ఎంతో శ్రద్ధగా ఉండేవాడు. చివరకు అతని మనోనిబ్బరమే అతన్ని కాపాడింది. పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు.
తర్వాత లండన్‌లో జార్జిరిచా అనే పుస్తక విక్రేత దగ్గర ఫేరడే పేపర్ బోయ్‌గా చేరాడు. అక్కడ కొన్ని అద్భుత గ్రంథాలను బైండింగ్ చేసే అవకాశం లభించింది. కెమిస్ట్రీకి సంబంధించిన పుస్తకాలు వస్తే వదలకుండా చదివేవాడు. లండన్‌లో సైన్స్‌పై ప్రసంగాలు వినడం కోసం తిండి కూడా మానుకుని టిక్కెట్లు కొనేవాడు. రసాయన శాస్త్రంపై ఆసక్తి బాగా పెరిగింది. తను కూడా పరిశోధనలు చేయవచ్చుననే ఆత్మవిశ్వాసం కలిగింది. దానికి తోడు బైండింగ్‌కి వచ్చిన పుస్తకాలలో ‘కాన్వర్‌సేషన్ ఇన్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఎక్స్‌ప్లెయిన్డ్’ అనబడే పుస్తకాలు ఫేరడేకి బాగా ఉపయోగపడ్డాయి.
ఆనాటి నుంచీ ప్రారంభమైన అతని సాధన క్రమక్రమంగా అభివృద్ధి చెంది, ప్రఖ్యాత శాస్తజ్ఞ్రుడిగా మారేలా బాటలు వేసింది. మైనర్స్ సేఫ్టీ ల్యాంప్‌ని కనిపెట్టిన సర్ హంఫ్రీ డేవి దగ్గర సహాయకుడిగా చేరి, అక్కడ కెమిస్ట్రీలో మరికొన్ని మెళకువలు నేర్చుకుని ప్రఖ్యాత సైంటిస్టుల దృష్టిలో పడ్డాడు. ఒకానొక దశలో హంఫ్రీడేవీ కూడా అసూయ చెందేంతటి ప్రజ్ఞను కనబరిచాడు.
ప్రభుత్వం వారు ‘సర్’ అనే బిరుదుని ఇవ్వబోతుంటే ‘నాకు ఒట్టి మైకేల్ ఫేరడీగా ఉంటేనే ఇష్టం’ అంటూ మర్యాదగా తిరస్కరించాడు. అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపిన మైకేల్ ఫేరడే ఎలక్ట్రిసిటీ, మేగ్నటిజం రంగాలలో అద్భుతమైన పరిశోధనలు చేసి చరిత్ర సృష్టించాడు. ఈనాడు మనం వినియోగిస్తున్న టెలివిజన్, ఎక్స్‌రే, వైర్‌లెస్ లాంటి సాధనాలు అతని పరిశోధనల ఫలితంగా నిర్దేశించిన సూత్రాలను ఆధారంగా చేసుకొని కనిపెట్టబడినవే. మానవాళికి మహోన్నతమైన ఉపకార సాధనాలను సృష్టించిన ఫేరడే 1867లో మరణించాడు.

-పి.వి.రమణకుమార్