Others

సంచలన నటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్భుత సౌందర్యంతో హొయలొలికించడమే కాదు, అసమాన అభినయ విన్యాసంతో సంచలన నటిగానూ కీర్తిశిఖరాలను అధిరోహించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంది. శక్తిమంతమైన నటనతో 2015లో సంచలన నటిగా ఆమె ముంబయిలో సోమవారం రాత్రి ‘సాన్‌సుయ్-కలర్స్-స్టార్‌డస్ట్’ అవార్డును అందుకుంది. ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, కాజోల్, సోనమ్ కపూర్ వంటి సుమారు వందమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరైన సభలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య ఈ అవార్డును స్వీకరించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో తొలిసారిగా ‘ఫేస్‌బుక్ లైవ్ రూమ్’ను ఏర్పాటు చేయడంతో సెలబ్రిటీలను నేరుగా ప్రశ్నించే అవకాశం సినీ అభిమానులకు కలిగింది. ఆహూతుల నుంచి వచ్చిన అనేక ప్రశ్నలకు సినీతారలు ఎంతో హుషారుగా సమాధానాలిచ్చారు.