Others

కమర్షియల్ అంటేనే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- పవన్ సాదినేని

ప్రేమ, ఇష్క్, కాదల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై మొదటి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకుని, తన రెండో
ప్రయత్నంగా సావిత్రి చిత్రాన్ని
తెరకెక్కించారు. తనకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలంటేనే ఇష్టమంటున్న దర్శకుడు పవన్ సాదినేనితో చిట్ చాట్..

* నేపథ్యం?
-మాది విజయవాడ. యుఎస్‌లో మాస్టర్స్ చేశాను. సినిమాలంటే చిన్నప్పటినుంచి ఆసక్తి. అవకాశాల కోసం షార్ట్ ఫిలిమ్స్ మీద దృష్టి పెట్టా. అలా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను.

* మొదటి అవకాశం?
-నేను చేసిన షార్ట్ ఫిలిమ్ చూసి లక్కీ మీడియా గోపీ కలవమన్నారు. అలా దర్శకుడిగా మొదటి చాన్స్ దక్కింది. ఆయనకు ప్రేమ ఇష్క్ కాదల్ కథ చెప్పడంతో బాగా నచ్చి అవకాశం ఇచ్చారు.

* గ్యాప్ ఎక్కువ వచ్చినట్టుంది?
-సావిత్రి సినిమా కోసం కొంచెం ఎక్కువ టైమ్ తీసుకున్న మాట నిజం. కానీ, దాన్ని గ్యాప్ అనలేం. సినిమా కోసమే వర్క్ చేయాల్సి వచ్చింది.

* సావిత్రి టైటిల్ పెట్టడానికి కారణం?
-టైటిల్ అలా అనిపించొచ్చుకానీ, ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా కాదు. సావిత్రి అనే అమ్మాయి చుట్టూ తిరిగే వైవిధ్యమైన కథ కావడంతో అందుకు తగ్గట్టే ఆ టైటిల్ పెట్టాం.

* సినిమా రెస్పాన్స్ ఎలా వుంది?
-ప్రస్తుతానికి అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్‌తో రన్ అవుతోంది. ముఖ్యంగా నారా రోహిత్ బాగా చేశాడని అంటున్నారు.

* ఏ తరహా సినిమాలు ఇష్టం?
-కచ్చితంగా కమర్షియల్ సినిమాలంటే ఆసక్తి. అలాంటి సినిమాలే చేస్తా.

* నెక్స్ట్ ప్రాజెక్ట్?
-ప్రస్తుతానికి కథలైతే రెడీగా వున్నాయి. ఇంకా ఏవీ ఫైనల్ కాలేదు.

- శ్రీ