Others

నీవులేక వీణ.. పలుకలేనన్నదీ...- నాకు నచ్చిన పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీతపరంగా, సాహిత్యపరంగా ఈ పాట ఇష్టపడని వారుండరు. అందులో నేనూ ఒకడిని. ఏఎన్నార్, సావిత్ర నటించిన డాక్టర్ చక్రవర్తి సినిమా కోసం ఆత్రేయ వారు అలతి లలతి పదాలతో అద్భుతాన్ని ఆవిష్కరిస్తే.. సుస్వరాల రాజేశ్వర రావు దానికి బాణీకట్టి మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. గంధర్వ గాత్రంతో సుశీల పాటకు ప్రాణం పోస్తే, మహానటి సావిత్రి తన అభినయంతో పరిపూర్ణత సమకూర్చారు. రసాత్మకంగా సాగే పాటకు సంబంధించిన శబ్దం విన్నపుడో, దృశ్యం చూస్తున్నపుడో మనసు మనసులో ఉండదు. ఎక్కడో సుదూరం నుంచి పాట విన్నా -మనోఫలకంపై దృశ్యం స్ఫురిస్తుంది. అదీ ఈ పాట గొప్పతనం. ‘పరువం వృధగా బరువుగా సాగే’ అన్న చరణంలో సావిత్రిని దృష్టిలో పెట్టుకునే ఆచార్య ఆత్రేయ ఈ వాక్యాన్ని రాసేరా అనిపిస్తుంది. విరహబాధను వ్యక్తంచేస్తూ సావిత్రి ఆ పాటలో జీవించేశారు. ‘జాజి పూలు నీకై/ రోజు రోజు పూచే’ అన్న చరణంలో ఔచిత్యానికి భంగం కలగకుండా నాతోపాటు ప్రకృతి కూడా నీకోసం ఎదురు చూస్తోందని చెప్పించడం గొప్ప సింబాలిజం. సావిత్రి నటనకు సాటి ఎవరు ఈ పాటలో. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ పాట మధురాతి మధురం. నాలాంటి వాళ్లకు ఎంతో ఎంతో ఇష్టం.

వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-కె శ్రీనివాసకుమార్, సింగరాయకొండ