Others

బాల్కనీలో సామాన్యుడు- శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటుడు నందమూరి తారక రామారావు మేన బావమరిది యు విశే్వశ్వరరావు విశ్వశాంతి ప్రొడక్షన్స్ పతాకంపై కంచుకోట (1967), నిలువుదోపిడి (1968), పెత్తందార్లు (1970), దేశోద్ధారకులు (1973) చిత్రాలు నిర్మించారు. సూపర్ డూపర్ హిట్ సాధించిన నాలుగు చిత్రాల కథాంశాలలో అంతర్లీనంగా రాజకీయాలతోపాటు సందేశం కూడా ఉంటుంది. మరొక విశేషమేమిటంటే ఒకే నిర్మాత ఒకే హీరోతో ఒకే దర్శకుడు, ఒకే రచయిత, ఒకే సంగీత దర్శకుడితో నాలుగు వరుస చిత్రాలు నిర్మించడం వెనుక నిర్మాతకు గల స్నేహపూర్వక వాతావరణం కనబడుతుంది. ఆ హీరో ఎన్టీఆర్, దర్శకుడు సిఎస్ రావు. రచయిత త్రిపురనేని మహారథి. సంగీతం కెవి మహాదేవన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వరుస చిత్రాల విజయం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ఈ స్నేహపూర్వక వాతావరణంలో రికార్డులు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. నిర్మాతగా నాలుగు చిత్రాల అనుభవం తర్వాత విశే్వశ్వరరావు తానే దర్శక నిర్మాతగా 1975లో తీర్పు చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారి. మిగతా తారాగణం అంతా కొత్తవారే. ఈ చిత్రం తెలుగు సినిమాలలో వినోదం పన్ను రద్దుకాబడిన మొదటి తెలుగు సినిమా. చిత్ర ప్రదర్శన టిక్కెట్ మూల్యం ఒక్క రూపాయి మాత్రమే. సామాన్య రిక్షా కార్మికుడు కూడా ఒక్క రూపాయి టిక్కెట్‌తో అప్పర్ క్లాస్‌లో కూర్చుని సినిమా చూసే అవకాశం కలుగజేసిన మొదటి తెలుగు సినిమా కూడా. మరొక రికార్డు ఏంటంటే.. ఈ చిత్రానికి సీక్వెల్‌గా మార్పు నిర్మించారు. తెలుగు సినిమా రంగంలో సీక్వెల్ అన్న పదం ఈ చిత్రాలతోనే ప్రారంభమైంది. అలాంటి ‘తీర్పు’నకు జరిగిన అభినందన సభ దృశ్యమిది. 1975లో ప్రముఖ సాంస్కృతిక సంస్థ బాలాజీ ఆర్ట్స్ థియేటర్స్ ఎవి స్వామి ఆధ్వర్యంలో భారీస్థాయిలో నిర్వహించబడిన తీర్పు అభినందన సభా కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సినారెను ఇక్కడ చూడొచ్చు. చిత్రంలో దర్శక నిర్మాత యు విశే్వశ్వరరావు, మరో దర్శకుడు పి పుల్లయ్య, ఆనాటి హోంమంత్రి కె ప్రభాకర్‌రెడ్డి, వెండితెర సంపాదకుడు బిఎ శాండిల్య తదితరులకు చిత్రంలో చూడొచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717