రుచి

కాలీఫ్లవర్‌తో క్యాన్సర్‌కు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజా కూరగాయలను వంటల్లో విరివిగా వాడితే ఉదర సంబంధ క్యాన్సర్ల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. కాలీఫ్లవర్, బంగాళాదుంపలు, ఉల్లిపాయలను వీలైనంత ఎక్కువగా తింటే ఉదర సంబంధ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉండవని చైనాలోని జెజియాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ అధ్యయనంలో తేల్చిచెప్పారు. బీరు, ఇతర మత్తు పానీయాలు, ఉప్పు, నిల్వ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఉదర క్యాన్సర్ల కారణంగా బ్రిటన్‌లో ప్రతి రోజూ కనీసం 13 మంది మృత్యువాత పడుతున్నారని పరిశోధకులు గమనించారు. ఈ తరహా క్యాన్సర్లతో బాధపడుతున్నవారిలో పదేళ్ల వ్యవధిలో 15 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బంగాళాదుంపలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయల్లో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. కడుపులోని కణజాలంపై విటమిన్-సి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కూరగాయల ద్వారా ప్రతిరోజూ కనీసం 50 గ్రాముల విటమిన్-సి శరీరానికి అందితే ఉదర సంబంధ క్యాన్సర్లను గణనీయంగా తగ్గించే వీలుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి రోజూ వంద గ్రాముల పండ్లముక్కలను తింటే కనీసం అయిదు శాతం మేరకు క్యాన్సర్‌ను నిరోధించే అవకాశం ఉందంటున్నారు.