రాష్ట్రీయం

అధికార పార్టీవి దిగజారుడు రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విరుచుకుపడ్డ విపక్ష సభ్యులు
హైదరాబాద్, డిసెంబర్ 17: తమ స్వార్థంకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విపక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలోని మీడియా పాయింట్‌లో ప్రతిపక్ష శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, గౌరు చరిత, ఉప్పులేటి కల్పన, సురేష్‌కుమార్, పుష్పవాణి, ఐజయ్య, రామకృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. అంబేద్కర్ పేరు చెప్పి సభను తప్పుదారి పట్టించేందుకు అధికార పక్షం కుట్రలు పన్నుతోందని అన్నారు. అంబేద్కర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణతో పాటు ఈ అంశంపై ఎన్నిరోజులైనా చర్చించేందుకు తాము సిద్ధమని, అంబేద్కర్ అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని అన్నారు. అయితే బిఏసిలో చర్చించని అంశాన్ని తెరమీదకు తెచ్చి కాల్‌మనీ వ్యవహారంపై చర్చను దాటవేశారని అన్నారు. కాల్‌మనీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే అది ప్రాధాన్యత లేని అంశంగా, ఎప్పుడైనా చర్చిద్దామని చెప్పడం దారుణమని అన్నారు. కాల్‌మనీ ముసుగులో మైనర్లు నుంచి మొదలుకుని ఎంతోమందిని వ్యభిచార రొంపిలోకి దింపుతుంటే యావత్ దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వారు విమర్శించారు. ఈ కేసులో తెలుగుదేశం ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, వంశీ వంటి వారికి సంబంధం ఉందని ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకుండా, తమ వాళ్లను కాపాడుకునేందుకు రాష్టమ్రంతా వడ్డీవ్యాపారులపై దాడులు చేసి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబునాయుడుకు కూడా సంబంధం ఉందని భావించాల్సి వస్తోందని అన్నారు. కాల్‌మనీ వ్యవహారంతో సంబంధం ఉన్న దూడల రాజేష్ అనే వ్యక్తికి జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని, తమ పార్టీ వ్యక్తి కాదని చెప్పినా తమ పార్టీపై కాల్‌మనీ బురద చల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని అన్నారు.