జాతీయ వార్తలు

ఆన్‌లైన్‌లో ఉచితంగా సిబిఎస్‌ఇ పుస్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్‌ఇ) పాఠ్యాంశాలు, ఈ పుస్తకాలు ఆ న్‌లైన్‌లో ఉచితంగా అందుబాటు లో ఉంచుతున్నట్టు కేంద్ర మానవ వనరుల మంత్రి ఇస్మృతీ ఇరానీ వెల్లడించారు. తూర్పు ఢిల్లీలో కేంద్రీయ విద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం మంత్రి పాల్గొన్నా రు. విద్యా ప్రమాణాలు పెంపునకు అనేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.‘ఇప్పటికే ఎన్‌సిఆర్‌టి పుస్తకాలతోపాటు అదనంగా పాఠ్యాంశాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చాం. వాటన్నింటినీ ఉచితంగానే పొందే సదుపాయం కల్పించాం’అని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సుపరిపాలనో భాగం గా సిబిఎస్‌ఇ పాఠ్యాంశాలు, ఈ పుస్తకాలు ఉచితంగా ఆన్‌లైన్లో పొందేందుకు చర్యలు తీసుకున్నట్టు స్మృతి పేర్కొన్నారు. పాఠ్యాంశాలకు సంబంధించిన దృశ్యశ్రవణం కూడా ఉచితం గా అందజేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంపొందించడానికి ప్రభు త్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన సూచనపై స్పందిస్తూ చెప్పారు. తమ మంత్రిత్వశాఖ ‘బాల్ సభ’లు నిర్వహిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఇందు లో భాగంగా నిపుణులతో విద్యార్థులకు ముఖాముఖీ, సమావేశాలు ఏర్పాటు చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని స్మృతి స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వినూత్నమైన మార్పు లు తీసుకురాన్నుట్టు మంత్రి ప్రకటించారు. విద్యార్థుల హాజరు అలాగే మార్కుల వివరాలు తెలుపుతూ తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతామని ఆమె వెల్లడించారు. దీని వల్ల పిల్లల ప్రతిభపై తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పించినట్టవుతుందని మంత్రి అన్నారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేలా విద్య ఉండాలని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సూచించారు.