ఓ చిన్నమాట!

ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన జీవితం ఓ ఆటలాంటిది.
ఆటలా మనం భావించాలి.
ఆటలో గెలుపులూ వుంటాయి.
ఓటములు శుంటాయి.
గెలుపు సంతోషాన్ని ఇస్తుంది.
ఓటమి నిరుత్సాహాన్ని ఇస్తుంది.
నిజానికి ఓటమి గెలుపునకు పునాదిగా మార్చుకోవాలి. ఆ విధంగా మార్చుడుంటే మనం గెలుపు వైపు ప్రయాణం చేస్తాం.
జీవితంలో గెలుపు ఓటములు సహజంగా వుంటాయి. అయితే చాలా మంది ఓటములను గుర్తుకు తెచ్చుకొని బాధ పడుతూ ఉంటారు.
అయితే వాళ్లు ఒక్క విషయం మర్చిపోతున్నారు. అత్యద్భుతమైన ఆటని తరచూ రీప్లే చేస్తూ వుంటారు.
చెత్తగా ఆడిన ఆటను తరచూ ప్రదర్శించరు.
గెలుపునే రీప్లే చేస్తారు.
వాటినే ఆస్వాదిస్తారు.
కానీ జీవితంలో అతి తక్కువ సార్లు విజయాల వైపు దృష్టి సారిస్తాం. వాటిని అతి తక్కువసార్లు రీప్లే చేసుకుంటాం.
మనలో చాలామంది జీవితంలో తమకు కలిగిన అసౌకర్యాల వైపు, నిరాశల వైపు, నిరుత్సాహాల వైపు ఎక్కువగా తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. వాటినే తరచూ మననం చేసుకుంటూ వుంటారు. తాము కోల్పోయిన అవకాశాలు, తాము తీసుకోకపోయిన నిర్ణయాల వైపు తమ దృష్టిని కేంద్రీకరించి బాధ పడుతూ ఉంటారు.
ఈ అంశాలను తరచూ రీప్లే చేసుకోవడం వల్ల తరచూ జ్ఞాపకం చేసుకోవడం వల్ల అవి మనలని గాయపరిచి మనం ఏ పనీ చేయకుండా తయారుచేస్తాయి.
ఈ అంతరంగ ప్రకంపనలు మనకి ఏ విధంగా సహాయపడవు. అవి అనవసరమైనవి కూడా.
అందుకని
మన జీవితంలోని మంచి సంఘటనల వైపు మన దృష్టిని కేంద్రీకరించాలి.
వాటిని తరచూ మన మనస్సు మీద ప్రసారం చేస్తూ వుండాలి.
వాటి వల్ల కొంత ఉత్తేజం కలుగుతుంది. జీవితంలో మంచి అడుగులు వేస్తాం.

- జింబో 94404 83001