ఓ చిన్నమాట!

ఓ పదిమంది... (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను జ్యుడీషియల్ అకాడెమీలో పని చేస్తున్నప్పుడు చాలామంది న్యాయమూర్తులకి శిక్షణని ఇచ్చాను. కాలక్రమంలో అకాడెమీ వదిలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాను. ఆ తరువాత క్లాసులు తీసుకోవడం తగ్గిపోయింది.
ఎప్పుడైనా గెస్ట్ లెక్చర్స్‌కి పిలిస్తే వెళ్లడం పరిపాటిగా మారిపోయింది.
ఓ నాలుగు మాసాల క్రితం పోలీస్ అకాడెమీలో ఓ జాతీయ స్థాయి వర్క్ షాప్ జరిగింది. అది ‘ఎన్‌కౌంటర్ల’ గురించి. తీవ్రవాదం గురించి. నన్ను మాట్లాడటానికి పిలిచారు. ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు న్యాయపరమైన ఎంక్వైరీ ఎలా వుంటుందన్న విషయం మీద నేను మాట్లాడాలి. అందులో పాల్గొంటున్న వ్యక్తులందరూ సీనియర్ పోలీస్ అధికారులు.
నా ఉపన్యాసం రూల్ ఆఫ్ లా గురించి మొదలైంది. తప్పుడు ఎన్‌కౌంటర్లు చేయకూడదు. పోలీసులు సాంఘిక శాస్తవ్రేత్తలు కాదు. శాసనాలని అమలుచేసే వ్యక్తులు అన్న దిశలో నా ఉపన్యాసం సాగింది. ఈ రకమైన ఉపన్యాసం పోలీసు అధికారులకు నచ్చదు.
నా ఉపన్యాసం తరువాత ఇంటరాక్షన్‌లో చాలామంది నా అభిప్రాయాలతో విభేధించారు.
మేం మా కోసం ఎన్‌కౌంటర్లు చేయడం లేదు. ఈ సమాజం కోసం చేస్తున్నామని కొందరు, రాజకీయ నాయకులు కోరితే చేస్తున్నామని మరి కొందరు అధికారులు మాట్లాడారు.
తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.
ముప్పైమందిలో ఓ పది మంది తీవ్రంగా విభేదించారు.
‘చట్టాన్ని పాటించమంటే ఇంత ఇబ్బంది వుంటే, ఎలా?’ అని కొందరు అన్నారు.
వాళ్లందరికి నేను చెప్పిన సమాధానం ఒక్కటే. ఈ క్లాసులోనే కాదు. ప్రతి క్లాసులో ఇదే పరిస్థితి ఉంటుంది. చర్చనీయాంశాల మీద క్లాసులో పరిస్థితి ఇలాగే ఉంటుంది.
వాళ్లకి నేను చెప్పిన సమాధానం...
‘ప్రతి క్లాసులోనూ ఓ పది మంది ఆలోచించే వ్యక్తులు ఉంటారు. మిగతా వ్యక్తులు చెప్పిన విషయాలతో మనసులో ఏకీభవించినా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. నేను చెప్పిన విషయం శాసన ప్రకారం నడుచుకొమ్మని. అది ఈ దేశంలో చాలామందికి నచ్చదు. ఈ క్లాసులో కూడా ఓ పది మంది నేను చెప్పిన విషయాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నమ్మకం నాకుంది.’
క్లాసులో చప్పట్లు మారుమ్రోగాయి.

- జింబో 94404 83001