ఓ చిన్నమాట!

భాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు నేను హైదరాబాద్‌లో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నాను. జగన్నాథరెడ్డి మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పని చేస్తున్నారు. భోపాల్‌లో వున్న జాతీయ జ్యుడీషియల్ అకాడెమీలో ఓ కాన్ఫరెన్స్‌కి హైకోర్టు మా ఇద్దరినీ ఎంపిక చేసి పంపించింది.
దేశంలోని న్యాయమూర్తులందరూ కలిసి పాల్గొనే అకాడెమీ అది. ఆ అకాడెమీ మొదలైన కొత్తలోనే మాకు అక్కడికి వెళ్లే అవకాశం కలిగింది. అది మూడు రోజుల కాన్ఫరెన్స్. నాలుగు గంటల వరకు షెడ్యూలు. ఆ తరువాత ఫ్రీ టైం. కొంతమంది లైబ్రరీలో కూర్చొనేవారు. మరి కొంతమంది భోపాల్ నగరం చూడ్డానికి వెళ్లేవారు. అకాడెమీ నగరానికి దూరంగా చాలా ఎతె్తైన ప్రదేశంలో వుంటుంది. చాలా గొప్పగా కట్టారు. కట్టడమే కాదు. అక్కడ కాన్ఫరెన్స్‌లు కూడా బాగా జరుగుతాయి. మొదటి రోజు సాయంత్రం నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలు చూసి చౌరస్తా దగ్గరికి వచ్చాం నేనూ, జగన్నాథరెడ్డి. అక్కడ నుంచి అకాడెమీ వెళ్లడానికి కార్లు వుంటాయి. ఫోన్ చేస్తే అకాడెమీ నుంచి కారు వస్తుంది.
ఆ చౌరస్తాలో ‘మృగనయిని’ అన్న పేరుతో ఓ చేతివృత్తుల దుకాణం ఉంది. అందులో ఎక్కువగా చీరెలు వుంటాయి. ఇతర రాష్ట్రాల న్యాయమూర్తులకి గౌరవంగా కొంత ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇస్తారు.
నేనూ, జగన్నాథరెడ్డి కలిసి షాపులోకి వెళ్లాం. మాకు తోచిన చీరలు ఓ పది నిమిషాల్లో కొనుగోలు చేసి, ఏవో విషయాలు తెలుగులో మాట్లాడుకుంటూ బిల్లింగ్ కౌంటర్ దగ్గర నిల్చున్నాం.
అప్పుడు ఓ జంట మా దగ్గరికి వచ్చారు. ఇద్దరూ అందంగా వున్నారు. ఆమె చాలా ఆకర్షణీయంగా ఉంది. వాళ్ల ఇద్దరు పిల్లలు కూడా చాలా అందంగా చలాకీగా వున్నారు.
మా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకున్నారు. మేమూ అక్కడికి వచ్చిన విషయం చెప్పాం. వాళ్లిద్దరూ తెలుగు వాళ్లు. మరో ఇద్దరు తెలుగు వాళ్లని చూడగానే వాళ్లకి ప్రాణం లేచి వచ్చినట్టుంది. అలా వాళ్లు వచ్చిన పనిని పక్కనబెట్టి మాతోనే మాట్లాడుతూ నిల్చున్నారు. అతను ‘నాబార్డ్’లో పని చేస్తున్నాడు.
ఇంకా ఎన్ని రోజులు ఉంటారని మమ్మల్ని అడిగారు. ఓ రెండు రోజులు ఉంటాం. మూడో రోజు వెళ్లిపోతామని చెప్పాం.
అతను తన విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడు. ఆ తెల్లవారి సాయంత్రం భోజనానికి వాళ్లింటికి రమ్మని ఆమె కోరింది. ఆ తరువాత అతను చెప్పాడు.
మాకు ఏమి అనాలో తోచలేదు. సరేనన్నట్టుగా తలవూపాం. వీలైతే వస్తామని, ఫోన్ చేస్తామని చెప్పాం.
కానీ వీలు కుదరలేదు. మళ్లీ చెప్పడానికి వాళ్ల దగ్గర మా ఫోన్ నెంబరు లేదు. ఆ తరువాత జాతీయ జ్యుడీషియల్ అకాడెమీకి చాలాసార్లు వెళ్లాను. మృగనయిని వెళ్లినప్పుడల్లా వాళ్లే గుర్తుకొచ్చేవాళ్లు.
ఇప్పుడూ అంతే! మాసబ్ ట్యాంక్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడల్లా వాళ్లే గుర్తుకొస్తారు.
అక్కడ ‘నాబార్డ్’ బోర్డు పెద్దది ఉంది.
ప్రాంతం కాని ప్రాంతంలో
భాష మనుషుల్ని ఎంత దగ్గర చేస్తుంది.
అక్కడ యాసతో పనిలేదు. అది ఆటంకమూ కాలేదు. కాదు కూడా.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001