ఓ చిన్నమాట!
పదును
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నాకు ఓ చిన్న మారుతి కారు వుండేది. కొత్త కారు కొనుక్కున్న తరువాత దాన్ని వాడటం తగ్గించి వేశాను. అప్పుడు ఈ కార్ల ఎక్స్‌ఛేంజీలు లేవు. కొంతకాలం మారుతిని అప్పుడప్పుడూ ఉపయోగించేవాళ్లం. కానీ ఎక్కువగా అది నిరుపయోగంగానే వుండేది.
ఓసారి దాన్ని అమ్ముదామని చూస్తే దానికి చాలా తక్కువ ధరని కోట్ చేశారు. అంత తక్కువ ధరకు అమ్మడం ఎందుకని అమ్మలేదు. అట్లా అని ఎవరికీ ఇవ్వలేదు.
కొంతకాలం తరువాత దాని బ్యాటరీ పోయింది. మరి కొంతకాలం తరువాత అది స్టార్ట్ కావడం కూడా మానేసింది. కొత్త బ్యాటరీతో కూడా అది స్టార్ట్ కాలేదు.
ఏదైనా అంతే!
ఉపయోగంలో లేకపోతే ఎందుకూ పనికిరాకుండా పోతాయి.
అవి కత్తులు కావొచ్చు.
వ్యవసాయపు పనిముట్లు కావొచ్చు.
యంత్రాలు కావొచ్చు.
తుప్పుపట్టి పోతాయి.
మన మెదడూ అంతే!
దాన్ని ఉపయోగించకుండా ఉంటే అదీ తుప్పుపట్టి పోతుంది.
కొత్త ఆలోచనలు రావు.
నైపుణ్యత పెరగదు.
సృజనాత్మకత కన్పించదు.
అందుకని మెదడుని ఎప్పుడూ ఉపయోగిస్తూ ఉండాలి.
దాన్ని సమర్థవంతంగా వాడుతూ వుండాలి.
నవ సమాజంలో ఉపయోగపడే విధంగా దాన్ని ఉపయోగించాలి.
చురుకుగా వుంచాలి. పదును పెంచాలి.
అలా వుంచే విధంగా ప్రయత్నం నిరంతరం చేస్తూ వుండాలి.
అందుకు మనం చేయాల్సింది-
చదవడం
అధ్యయనం చేయడం
ఇతరులతో చర్చించడం
మనలో వున్న సృజనాత్మక శక్తికి పని పెట్టడం.
అప్పుడే
మనలో ఎదుగుదల కన్పిస్తుంది.
జీవితాంతం వరకు మనం చేయాల్సింది ఇదే.
దీనికి పదవీ విరమణ లేదు.