ఓ చిన్నమాట!

బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మధ్య ఐ ఫోన్ రిపేర్ కోసమని ఆప్ట్రానిక్స్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లాను. ఓ అరగంటలో ఇస్తానని చెప్పడం వల్ల అక్కడే కూర్చున్నాను. చాలామంది కస్టమర్లు వస్తున్నారు. వెళ్తున్నారు. ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను.
మా వూరికి చెందిన ప్రసాద్ అన్న వ్యక్తిలా ఒక వ్యక్తి కన్పించాడు. అతనితో నాకు ఎక్కువగా పరిచయం లేదు. అతని పేరు తెలుసు. వాళ్లకి ఓ చిన్న హోటల్ ఉండేది. మా వూర్లో కన్పించినప్పుడు అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకటి రెండు సార్లు వాళ్ల హోటల్‌కి వెళ్లినప్పుడు మాట్లాడినట్టు గుర్తు. అంతే!
మా వూరు రోడ్డు మీద చాలాసార్లు కన్పించేవాడు. ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు. అతనూ అంతే! మళ్లీ అతని వైపు చూశాను. అతను ప్రసాదే. అతను నా వైపు చూశాడు. నన్ను గుర్తుపట్టాడు. నేను సీటులోంచి లేచాను.
అతను దగ్గరిగా వచ్చి ‘నమస్కారం సార్!’ అన్నాడు.
‘ఏం ప్రసాద్! ఎలా వున్నావు? హోటల్ ఎలా నడుస్తుంది?’ అడిగాను.
‘ఇప్పుడు హోటల్ లేదు సార్. వేరే బిజినెస్ చేస్తున్నాను. అప్పుడప్పుడూ కస్టమర్ల ఫోన్లు రిపేర్‌కి హైదరాబాద్ వస్తుంటాను’ అన్నాడు.
కాస్సేపటి తరువాత అతను వెళ్లిపోయాడు.
ప్రసాద్ విషయంలోనే కాదు. మన వూరి వాళ్లు అనుకోకుండా నగరంలో తారసపడితే - ఏదో ఉత్సాహం ఏవో జ్ఞాపకాలు...
మా వూర్లో అపరిచితుల్లాగా వుండే వ్యక్తులు మరో ప్రాంతంలో కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. ఏదో తెలియని బంధం మనలని కలుపుతుంది. మాట్లాడిస్తుంది.
ఇది నగరం సంగతి.
వేరే రాష్ట్రంలో ఓ తెలుగు వాడు కన్పిస్తే మనస్సు పొంగిపోతుంది. ఆ మధ్య భోపాల్‌కి ఓ కాన్ఫరెన్స్ కోసం నేను, మరో న్యాయమూర్తి జగన్నాథరెడ్డి, వెళ్లాం. అక్కడి చీరెల షాపులో ఓ తెలుగు జంట మా మాటల్ని విని దగ్గరకొచ్చి పలకరించారు. అతను అక్కడ బ్యాంక్‌లో పని చేస్తున్నాడట. మాకు వీలు కాలేదు. వీలైతే వెళ్దామని అనుకున్నాం.
విదేశంలో అయితే మన దేశం వాడు కన్పిస్తే చాలు. మనస్సు పొంగుతుంది.
ఏదో తెలియని బంధం మనల్ని కలుపుతుంది. మాట్లాడిస్తుంది. ఏవో జ్ఞాపకాలు, అనుభూతులు వర్షిస్తాయి.
దగ్గర కన్నా దూరం మనుషుల్ని దగ్గర చేస్తుంది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001