ఓ చిన్నమాట!

మనసు పెట్టి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా చిన్నప్పుడు మా అమ్మా, బాపు ఒక మాట చెప్పేవాళ్లు. ఏ పని చేసినా మనస్సు పెట్టి చెయ్యాలని.
మా అక్కల్లో ఎవరైనా టీ పెట్టి అది బాగా లేకపోతే మా అనేది మనస్సు పెట్టి చేయలేదని.
‘నువ్వు వేసినట్టే టీ పొడి, చక్కెర వేశానని, పాలు పోసాన’ని మా అక్కలు చెప్పేవాళ్లు.
నాలాగే టీ పొడి, చక్కెర వెయ్యడం, పాలు పొయ్యడం కాదు. నాలాగా మనస్సు పెట్టి చెయ్యాలి అని మా అమ్మ చెప్పేది.
మనస్సు పెట్టి చేయడం అంటే ఏమిటో అప్పుడు మా అక్కలకి అర్థం కాకపొయ్యేది.
ఏదైనా పనిని మాకు మా బాపు అప్పగించినప్పుడు మేం చేసేవాళ్లం. కానీ అది పరిపూర్ణంగా వుండకపొయ్యేది. అప్పుడు మా బాపు అనే మాట - వాడు మనస్సు పెట్టి చేయలేదని.
మనస్సు పెట్టి చేయడం ఏమిటో అప్పుడు పూర్తిగా అర్థం కాకపొయ్యేది.
కాలక్రమంలో మనసు పెట్టి చెయ్యడం అంటే ఏమిటో మాకు అర్థం అయ్యింది. నిష్టగా చేయడం. మనస్సంతా చేస్తున్న పని మీద కేంద్రీకరించి చేయడం.
ఇందుకు ఉదాహరణగా ఎందరినో చెప్పుకోవచ్చు.
వంటవాడు తన వంటని ఎంతో ఇష్టంగా అక్కడే కూర్చుని చేస్తాడు. అందుకే అవి అంత రుచిగా వుంటాయి.
పొలంలో పని చేసేవాళ్లు కూడా ఏదో పాట పాడుతూ దీక్షగా తమ పనులు చేస్తారు.
బట్టలు ఉతికే వ్యక్తి కూడా ఈల వేస్తూ పని చేస్తాడు. తన పనిలో నిమగ్నం అవుతాడు.
ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఆ విధంగా పని చేయడం లేదు. మనస్సు పెట్టి పని చేయడం లేదు.
వాళ్లు మనస్సు పెట్టి పనిచేస్తే చాలా పనులు త్వరగా అయిపోతాయి.
మనస్సు పెట్టి పనిచేస్తే ఫలితం బాగుంటుంది.
మనస్సు పెట్టి పనిచేస్తే వచ్చే ఫలితం వల్ల మనమే కాదు చాలామంది ఆనందంగా ఉంటారు.
మనస్సు పెట్టి పని చేయడం అంటే-
దీక్షగా పని చేయడం.
ఇష్టంగా పని చేయడం.
హృదయం పెట్టి పని చేయడం.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001