ఈ వారం తార

ఎన్టీఆర్ గీతోపదేశం -- శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకృష్ణ, గీతాంజలి దంపతులకు అన్నగారు నందమూరి తారక రామారావు మాటంటే వేదవాక్కు. వాళ్లింట్లో ఏ శుభకార్యం జరిపినా ఎన్టీఆర్‌ను సంప్రదించి సలహా తీసుకోకుండా ముందుకు సాగేవారు కాదు. ఇదిలావుంటే నటి జమున మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చే సమయంలో తనకు సంబంధించిన కొన్ని స్థలాలను విక్రయించటం జరిగింది. టి.నగర్ ప్రధాన కూడలి పానగల్ పార్కువద్ద స్థలానికి మంచి ఆఫర్లువచ్చినా రామకృష్ణ, గీతాంజలి దంపతులకు విక్రయించటం జరిగింది. ఆ స్థలమే మాకు మిగిలిన బంగారం అంటూంది గీతాంజలి నేటికీ.
అసలు విషయానికొస్తే ఆ స్థలంలో రామకృష్ణ దంపతులు తమ కుమారుడు శ్రీనివాస్ పేరిట ప్రీవ్యూ థియేటర్ నిర్మించి ఎన్టీఆర్‌ని ఆహ్వానించి ప్రారంభించారు. అది నేటికీ ఒక బిజీ థియేటర్‌గా కొనసాగుతోంది. ఈ సందర్భంలో మరొక చేదు అనుభవం కూడా గుర్తుకొస్తోంది.
రామకృష్ణ, గీతాంజలి దంపతులు నిర్మాణ రంగంలో ప్రవేశించి ధవళ సత్యం దర్శకత్వంలో రామాపురంలో సీత చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు మొదలుపెట్టి షూటింగ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించటానికి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు. రామకృష్ణ దంపతులు చెప్పిందంతా విని ఆవేశంగా లేచినుంచొని నో.. నో... నేను రాను అని తేల్చిపారేసారు. బిత్తరపోయి చూస్తున్న రామకృష్ణ ఉద్దేశించి అసలు నటుడు అన్నవాడి బాధ్యత ఏమిటి? మంచి పాత్రలుగల కథలను ఎన్నుకొని ఆయాపాత్రల పట్ల ఏకాగ్రత ప్రదర్శించి మంచి చిత్రాల నిర్మాణానికి ముందుకు సాగాలి. మమ్మల్ని చూస్తున్నారు కదా. నిర్మాణ రంగంలో అడుగిడి కొన్ని పాత్రలపట్ల ఏకాగ్రత ప్రదర్శించలేకపోతున్నాం. అందుకే నటుడన్నవాడు కేవలం పాత్రలపట్ల ఏకాగ్రత చూపుతూ ముందుకు సాగాలి అని హితవు పలికారు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717