జాతీయ వార్తలు

ఓ యాత్రికునిగానే మన్మోహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్, అక్టోబర్ 20: పాకిస్తాన్‌లోని పవిత్ర స్థలమైన కర్తాపూర్ కారిడార్ అధికారిక ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకావడం లేదు. అయితే సాధారణ యాత్రికుని తరహాలోనే కర్తాపూర్‌ను సందర్శించాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇదిలాఉండగా నవంబర్ 9న జరిగే కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా తాను శనివారం ఆహ్వానించగా, తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఆదివారం తన సొంత పట్టణమైన ముల్తాన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సిక్కులు పవిత్ర స్థలంగా భావించే చారిత్రక కర్తాపూర్ యాత్ర కారిడార్ అధికారిక ప్రారంభోత్సవానికి మన్మోహన్ సింగ్ హాజరు కావడం లేదని సింగ్ సన్నిహితులు చెప్పారు. ఈ మేరకు పాక్ మంత్రి ఖురేషీ పంపిన ఆహ్వానానికి ప్రత్యుత్తరంగా సమాధానం పంపించినట్లు తెలిసింది. తాను సాధారణ యాత్రికుని తరహాలోనే సందర్శిస్తానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ నేతృత్వంలోని జాతా ప్రతినిధుల బృందంలో సింగ్ కూడా ఉన్నారు. ఈ ప్రతినిధుల బృందం కర్తాపూర్‌లోని విగ్రహాన్ని దర్శించుకుని అదే రోజున వెనక్కి తిరిగి వస్తుంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో డేరా బాబా నానక్ దేవతామూర్తి నుంచి కర్తాపూర్‌లోని దర్బార్ సాహిబ్ వరకు వీసా లేకుండానే యాత్రికులు సందర్శించేందుకు పాక్ ప్రభుత్వం ఇదివరకే అనుమతించిన సంగతి తెలిసిందే. 1522 సంవత్సరంలో గురునానక్ దేవ్ కర్తాపూర్‌లో ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇలాఉండగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశ (పాక్) పరిథిలోని పవిత్ర స్థలమైన కారిడార్‌ను ప్రారంభిస్తారని ఆ దేశ మంత్రి ఖురేషీ తెలిపారు. ప్రతి ఏడాది సుమారు 5 వేల మంది భారతీయ సిక్కులు సందర్శిస్తున్నారని ఆయన తెలిపారు.

*చిత్రం... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్