శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

29న పీఎస్‌ఎల్‌వీ-సీ 43 రాకెట్ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 18: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఈ నెలాఖరులో పీఎస్‌ఎల్‌వీ-సీ 43ప్రయోగం చేపట్టేందుకు సన్నాహం చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం హైసిస్‌తోపాటు మరో 30దేశాలకు చెందిన ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు షార్‌లో చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే రాకెట్ మూడుదశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇస్రో రూపొందించిన హైసిస్ ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలు కూడా షార్‌కు చేరుకున్నాయి. ఉపగ్రహాలను క్లీన్‌రూమ్‌లో పెట్టి తుదిపరీక్షలు కూడా నిర్వహించారు. సోమవారం నుంచి రాకెట్ చివరి భాగంలో ఉపగ్రహాలను అమర్చనున్నారు. ఈనెల 14న షార్ నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ 2 ప్రయోగాన్ని శాస్తవ్రేత్తలు విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇదే ఉత్సాహంతో పక్షంరోజుల వ్యవధిలోనే శాస్తవ్రేత్తలు మరో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి సిద్ధమవటం విశేషం. అన్ని సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29న షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 43 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.