ఆంధ్రప్రదేశ్‌

మా నియోజకవర్గాల్లో తిరుగుతూ మాకు చెప్పరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి నారాయణను నిలదీసిన వైకాపా ఎమ్మెల్యేలు.. నెల్లూరు జడ్పీ సమావేశంలో వాగ్వాదం

నెల్లూరు, డిసెంబర్ 5: తమ నియోజకవర్గాల్లో రాష్ట్ర మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ సమాచారం ఇవ్వకనే పర్యటిస్తున్నారంటూ వైఎస్‌ఆర్‌సి ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో వైఎస్‌ఆర్‌సి, తెలుగుదేశంపార్టీ సభ్యుల నడుమ తీవ్రస్థాయి వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. తొలుత సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రాష్టమ్రంత్రి పొంగూరు తన నియోజకవర్గంలోకి వచ్చేటప్పుడు సమాచారం ఉండటం లేదని వాపోయారు. దీనికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ గొంతు కలిపారు. దీంతో మంత్రి నారాయణ ఆగ్రహంతో ఊగిపోతూ ‘నువ్వు కావలిలో ఉండు. అలా జనానికి అందుబాటులో లేకుండా బెంగళూరులో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ తిరిగి నాపైనే విమర్శలు చేస్తావా’ అంటూ మండిపడ్డారు. ‘నువ్వు అర్ధరాత్రి వేళల్లో పర్యటనలు చేస్తావేమిటి’ అంటూ మంత్రిని ఉద్దేశించి రామిరెడ్డి తప్పుబట్టారు. మంత్రికి వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సి సభ్యులు వాదన వినిపించగా, టిడిపి సభ్యులు ప్రతిదాడికి దిగారు. దీంతో సభలో పలు పర్యాయాలుగా రెండు పార్టీల నాయకుల నడుమ తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మంత్రి వివరణ ఇస్తూ, తాను అధికారికంగా చేపట్టే పర్యటనలపై ముందుగా జిల్లా కలెక్టర్‌కు సమాచారం వెళ్తుందన్నారు.
కలెక్టర్ ద్వారా ప్రొటోకాల్ సమాచారం ప్రజాప్రతినిధులకు తెలుస్తుందన్నారు. అలాకాకుండా తన పర్యటనలు ఆకస్మిక తనిఖీలైతే ముందుగా ఎవరికీ తెలియజేయడం ఉండదన్నారు. కేవలం ఒక్క నిమిషం ముందుగానే అధికార్లకు తెలుపుతామన్నారు. తనిఖీలకు సంబంధించి కూడా అందరికీ ముందుగా తెలిస్తే లాభం ఏముందని మంత్రి ఎదురు ప్రశ్నించారు. తన రాక ముందుగా తెలిస్తే, ముగ్గులు వేసి స్వాగతిస్తారే తప్ప వాస్తవ సంగతులు తన దృష్టికి రాబోవని వివరణ ఇచ్చారు. ‘అయినా అభివృద్ధి పనుల శిలాఫలకాల్లో మీ పేర్లు ఉంటున్నాయ్ కదా.మా మంత్రి వచ్చేటప్పుడు మీకు చెప్పకపోతే ఏమైందని’ తెలుగుదేశం సభ్యులు ఎద్దేవా చేశారు. అలాగే జన్మభూమి కమిటీల పేరుతో విపక్ష ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారంటూ కూడా వైఎస్‌ఆర్‌సి సభ్యులు మండిపడ్డారు. కడకు వరద నష్టపరిహారం పంపిణీకి కూడా జన్మభూమి సభ్యులే తప్పక హాజరు కావాలనే అంతర్గత ఆదేశాలు శోచనీయమన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాదని, టిడిపి ఇన్‌చార్జిలు పెత్తనం చలాయించడాన్ని వైఎస్‌ఆర్‌సి సభ్యులు దుయ్యబట్టారు. ఇదిలాఉంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి సభాముఖంగా గుప్పించిన ప్రశ్నలకు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి నారాయణ పరోక్షంగా కంగు తిన్నారు. నెల్లూరు పరిసరాల్లో పంట కాలువల ప్రవాహాన్ని దారి తప్పిస్తున్నారంటూ ఆరోపించారు. మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థలు ఆకుతోట వద్ద పంట కాలువను కబ్జా చేసి భవంతులు నిర్మించారని నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌చేసిన ఆరోపణలు ఈ సందర్భంగా కోటంరెడ్డి ప్రస్తావించారు. అలాంటివారిపై ఏం చర్యలు తీసుకున్నారని సభలో ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలారు. మొత్తం మీద అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాల మధ్య నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ముగిసింది.

మద్దతు ధర కోసం కేంద్రంపై వత్తిడి: తోట
కాకినాడ, డిసెంబర్ 5: రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర చెల్లించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కాకినాడ ఎంపి, లోక్‌సభలో టిడిపి ఫ్లోర్ లీడర్ తోట నరసింహం హామీ ఇచ్చారు. కాకినాడలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వరి సహా అన్ని రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించాల్సిందిగా ఎంపిలందరం ఐక్యంగా కేంద్రాన్ని కోరతామన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా భూముల్లో మార్పులు అనే అంశంపై చర్చ జరిగిందన్నారు. పంటలకు విచ్చలవిడిగా ఎరువులను వాడకుండా అరికట్టే చర్యలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. రైతులకు అందించే సబ్సిడీపై నిర్ధిష్టమైన విధానం అవసరమని కేంద్రానికి తాము సూచించినట్టు చెప్పారు. రైతులకు ఆయా పంటలు అధిక దిగుబడి కోసం భూమి పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకాన్ని చేపట్టాలని, నాసి రకం ఎరువుల పంపిణీ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉందని కేంద్రానికి విన్నవించినట్టు తెలియజేశారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో ఆరు లక్షల మంది రైతులకు భూ ఆరోగ్య పత్రాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్తవ్రేత్త డాక్టర్ ప్రవీణ, శాస్తవ్రేత్త డాక్టర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.