జాతీయ వార్తలు

పాక్ హిందువులు ఇక ఆస్తులూ కొనుక్కోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: భారత్‌లో దీర్ఘకాలిక వీసాపై నివసిస్తున్న పాకిస్తాన్‌కు చెందిన మైనారిటీ మతస్థులు త్వరలో భారత్‌లో ఆస్తులను కొనుగోలు చేయడానికి, బ్యాంకు ఖాతాలను తెరవడానికి అనుమతి లభించనుంది. పాన్ కార్డులు, ఆధార్ కార్డులను కూడా పొందనున్నారు. మోదీ ప్రభుత్వం వీరికి ప్రత్యేక సౌకర్యాలను కల్పించడానికి కసరత్తు చేస్తోంది. ఇతర సౌకర్యాలతో పాటు భారత పౌరులుగా నమోదు చేసుకోవడానికి చెల్లించాల్సిన రుసుమును వీరికి రూ.15వేల నుంచి వంద రూపాయలకు తగ్గించడానికి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి భారత్‌కు ఎంత మంది మైనారిటీ శరణార్థులు వచ్చారనే దానికి కచ్చితమైన లెక్కలు లేవు. అయితే సుమారు రెండు లక్షల మంది ఉంటారని అంచనా. వీరిలో చాలామంది హిందువులు, సిక్కులు. జోధ్‌పూర్, జైసల్మేర్, జైపూర్, రాయ్‌పూర్, అహ్మదాబాద్, రాజ్‌కోట్, కచ్, భోపాల్, ఇండోర్, ముంబయి, నాగ్‌పూర్, పుణె, ఢిల్లీ, లక్నో వంటి నగరాలలో సుమారు 400 పాకిస్తానీ హిందూ శరణార్థుల కాలనీలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొని భారత్‌కు శరణార్థులుగా వచ్చిన మైనారిటీ మతస్థులకు కొన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. ఆర్‌బిఐ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే వారు బ్యాంకు ఖాతాలను తెరచుకోవచ్చు. నివసించడానికి నివాస గృహాలను కొనుగోలు చేయవచ్చు. స్వయం ఉపాధి పొందడానికి అనువైన వసతిని పొందవచ్చు. వీరికి డ్రైవింగ్ లైసెన్సులను, పాన్, ఆధార్ కార్డులను జారీ చేస్తారు. స్వయం ఉపాధి లేదా వ్యాపార నిర్వహణ రెండింటిలో భద్రత రీత్యా ఏది సురక్షితం అనుకుంటే అది చేయడానికి అనుమతి ఇస్తారు. వారు నివసిస్తున్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా తిరగవచ్చు.