జాతీయ వార్తలు

కేరళ ఎన్నికల్లో కోలీవుడ్ కత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఏప్రిల్ 17: సినీ నటులు, డైరెక్టర్లు కత్తులు నూరుకుంటున్నారు. ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు విసురుకుంటున్నారు. కేరళలో మే 16న జరుగనున్న ఎన్నికల్లో కోలీవుడ్‌కు చెందిన కనీసం ఆరుగురు సెలబ్రిటీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, సీపీఐ(ఎం), బీజేపీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి ఈసారి సినిమా పాపులారిటీని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. సాధారణంగా రాజకీయంగా చైతన్యవంతమైన కేరళ ఓటర్లు సెలబ్రిటీలను పక్కన పెడతారు. కానీ, గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక నటుడు ఎంపీగా గెలవటంతో ట్రెండ్ మారిపోయింది. ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలుగా ఉన్న నటులు ముకేశ్, జగదీశ్‌లు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజకీయ నేతగా మారిన కాంగ్రెస్(బి) నేత కేబీ గణేశ్‌కుమార్‌కు సీపీఎం మద్దతునిస్తోంది. నటుడు భీమన్ రఘును బీజేపీ పఠనపురం నుంచి తన అభ్యర్థిగా రంగంలోకి దింపింది. గణేశ్‌కుమార్. జగదీశ్, బీమన్ రఘులు చాలా మలయాళ సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు ఎన్నికల వేళ పరస్పరం వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. వీరి పట్ల ఓటర్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
చెల్లిని కాల్చి చంపిన అయిదేళ్ల బాలుడు
న్యూయార్క్, ఏప్రిల్ 17: అయిదేళ్ల బాలుడు తన నాలుగేళ్ల చెల్లిని ఇంట్లోనే కాల్చి చంపిన సంఘటన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగింది. ఈ కుటుంబం నివసిస్తున్న కెన్సింగ్టన్ ప్రాంతంలో తరచుగా అల్లర్లు జరుగుతుంటాయి. అందువల్ల ఈ పిల్లల తల్లి వారిని అరుదుగా బయట ఆడుకోనిచ్చేవారు. అయితే శనివారం ఇంట్లోనే బాలుడు తన చెల్లినే కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఉన్న బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారని చెప్పారు. సంఘటన స్థలం నుంచి సెమీ ఆటోమాటిక్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

డాక్టర్లు రాహుల్‌ను
కాపాడుతున్నారు
ఐఎంఏకు ప్రత్యూష తండ్రి ఫిర్యాదు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: అనుమానాస్పద స్థితిలో ఇటీవల మృతి చెందిన టీవీ నటి ప్రత్యూష బెనర్జీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ నెల 1న ప్రత్యూష తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించిన ఒక రోజు తర్వాత ఛాతీలో నొప్పిగా ఉందంటూ రాహుల్ రాజ్ సింగ్ ముంబయిలోని శ్రీ సాయి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అతను ఈ రోజు ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యాడు. అయితే డబ్బులు తీసుకుని ఆస్పత్రివాళ్లు రాహుల్‌ను కాపాడుతున్నారంటూ ప్రత్యూష తండ్రి అఖిల భారత మెడికల్ అసోసియేషన్ (ఎఎంఐ)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఆరోపణలపై రాహుల్‌కు చికిత్స చేసిన శ్రీసాయి ఆస్పత్రికి చెందిన డాక్టర్ ఎస్‌జె గోయల్ స్పందిస్తూ, తనతోపాటుగా ఒక సైకియాట్రిస్టు, కౌన్సిలింగ్ ఇచ్చే ఇద్దరు రాహుల్ ఆరోగ్య పరిస్థితిపై ప్రతిరోజూ పోలీసులకు బులెటిన్లు ఇచ్చినట్లు చెప్పారు. నేరస్థుడెవరనేది తెలుసుకోవలసిన బాధ్యత పోలీసులదని ఆమె చెప్పారు.
ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన తర్వాత రాహుల్ ఆదివారం మధ్యాహ్నం బంగూర్ నగర్ పోలీసు స్టేషన్ ముందు హాజరయ్యాడు. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పాడంటూ రాహుల్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా, అతడ్ని ఈ నెల 18 వరకు అరెస్టు చేయరాదంటూ బొంబాయి హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించిన విషయం తెలిసిందే.