అంతర్జాతీయం

మృతుల కుటుంబాలకు 20వేల డాలర్ల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి: రష్యాలో శనివారం కూలిపోయిన తమ విమానంలో ఉన్న మొత్తం 62 మంది ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి 20 వేల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఫ్లై దుబాయి ఎయిర్‌లైన్స్ ఆదివారం ప్రకటించింది. అయితే కూలిపోయిన విమానంలో చనిపోయిన వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యులను కాంటాక్ట్ చేయడంతోపాటుగా బాధితులకు తక్షణం మద్దతు అందించడం తమ తొలి ప్రాధాన్యత అని దుబాయికి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ అయిన ఫ్లైదుబాయి తెలిపింది. సంస్థ నిబంధనల ప్రకారం తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చే ఉద్దేశంతో ఒక్కో ప్రయాణికుడికి 20వేల డాలర్ల చొప్పున మృతుల కుటుంబాలకు అందించడానికి త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దుబాయి నుంచి రష్యాలోని రోస్తోవ్-న్-డాన్ నగరానికి బయలుదేరిన బోయింగ్ 737-800 విమానం శనివారం తెల్లవారుజామున అక్కడి విమానాశ్రయంలో దిగబోతుండగా రన్‌వేపై కాకుండా పక్కన దిగడంతో పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు భారతీయులుసహా 55 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది మొత్తం చనిపోయారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి పైలట్ తప్పిదం కారణమా లేక సాంకేతిక లోపమా లేక ప్రతికూల వాతావరణమా అనే విషయాన్ని నిర్ధారించడానికి జరుగుతున్న దర్యాప్తులో తోడ్పడడానికి ఫ్లైదుబాయి సంస్థకు చెందిన ప్రతినిధులు రోస్తోవ్-ర్-డాన్ నగరానికి చేరుకుంటున్నారు. దాదాపు పది లక్షల జనాభా ఉండే ఈ నగరం మాస్కోకు దక్షిణంగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది.