జాతీయ వార్తలు

కేజ్రీవాల్, ఐదుగురు ఆప్ నేతలకు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అయిదుగురు నాయకులకు ఢిల్లీలోని ఒక కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ ఏడో తేదీన తన ముందు హాజరు కావలసిందిగా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమిత్ దాస్ ఆదేశించారు. కేజ్రీవాల్‌తో కుమార్ విశ్వాస్, అషుతోశ్, సంజయ్ సింగ్, రాఘవ్ చాధా, దీపక్ బాజ్‌పాయి సమన్లు జారీ అయిన వారిలో ఉన్నారు. ఐపిసిలోని సెక్షన్లు 500, 34 కింద అభియోగాలు మోపుతూ ఈ సమన్లు జారీ అయ్యాయి. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వివాదంలో కేజ్రీవాల్ సహా ఆప్ నాయకులు చేసిన ప్రకటనలు తన పరువుకు భంగం కలిగించాయని కొద్ది రోజుల క్రితం జైట్లీ ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు జైట్లీ, ఇతర సాక్షుల వాంగ్మూలాలను ఇదివరకే నమోదు చేసింది. జనవరి 5న జైట్లీ కోర్టు ముందు హాజరై కేజ్రీవాల్, అయిదుగురు ఆప్ నాయకులు తన పరువుకు భంగం కలిగించేలా తప్పుడు ప్రకటనలు చేశారని విన్నవించారు. డిడిసిఎ నుంచి తాను ఎలాంటి లబ్ధి పొందలేదని పేర్కొంటూ ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. కేజ్రీవాల్, అయిదుగురు ఆప్ నాయకులు వారిపై కోర్టులో ఫిర్యాదు చేసిన తరువాత కూడా తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారని, దానివల్ల తన ప్రతిష్ట దెబ్బతిన్నదని జైట్లీ పేర్కొన్నారు.

ప్రధాని, ముఖ్యమంత్రుల
ఫొటోలు అనుమతించాలి

సుప్రీం కోర్టుకు కేంద్రం, 7 రాష్ట్రాల అభ్యర్థన

న్యూఢిల్లీ, మార్చి 9: ప్రభుత్వ ప్రకటనల్లో రాష్టప్రతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోలే ఉండాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడుసహా ఏడు రాష్ట్రాలు సుప్రీం కోర్టును అభ్యర్థించాయి. ఈ తీర్పువల్ల ప్రాథమిక హక్కులను సమాఖ్య స్వరూపానికే విఘాతం కలుగుతుందని స్పష్టం చేశాయి. బుధవారం ఈ అంశంపై జరిగిన విచారణ అనంతరం రివ్యూ పిటిషన్లపై తీర్పును జస్టిస్ రంజన్ గగోయ్ సారధ్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. ప్రభుత్వం ఇచ్చే యాడ్‌లలో ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రుల ఫొటోలను అనుమతించాలని పిటిషనర్లు కోరారు. ఇలా ఉండగా సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ప్రకటనలు జారీ చేశారన్న పిటిషన్‌పై ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి, తమిళనాడులోని అన్నాడిఎంకె పార్టీకి నోటీసులు పంపింది. ఆరు వారాల్లో ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని ఈ రెండు రాష్ట్రాలను ఆదేశించింది.

ఇపిఎఫ్ నిబంధనలు
సవరిస్తాం: దత్తాత్రేయ
న్యూఢిల్లీ, మార్చి 9: కార్మికులందరికీ ప్రయోజనం చేకూర్చేవిధంగా ఇపిఎఫ్ నిబంధనలను సవరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పదిమంది పనిచేస్తున్న చిన్న సంస్థలను ఇపిఎఫ్ పరిధిలోకి తీసుకురానున్నట్టు బుధవారం రాజ్యసభకు తెలిపింది. ప్రస్తుత నిబంధల ప్రకారం 20 మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న కంపెనీలే ఇపిఎఫ్ పరిధిలో ఉన్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఇపిఎఫ్ నిబంధనలను సవరించడం ద్వారా సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించినట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్న కృతనిశ్చయంతో కేంద్రం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. రిక్షాకార్మికుల సామాజిక భద్రతకు ఓ పైలెట్ ప్రాజెక్టు అమలుచేయనున్నామని దత్తాత్రేయ వెల్లడించారు.

సభ్యులు అడిగిన పలుప్రశ్నలకు మంత్రి బదులిస్తూ నిబంధనలు ఉల్లంఘించే సంస్థలను ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.

జెఎన్‌యు విద్యార్థినులపై ప్రొఫెసర్ల లైంగిక వేధింపులు?

న్యూఢిల్లీ, మార్చి 9: ఓవైపు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జాతీయతా వాదం వివాదం కొనసాగుతూ ఉండగా మరోవైపు క్యాంపస్‌లో పిహెచ్‌డి చేసే విద్యార్థునులపై లైంగిక వేధింపులు విచ్చలవిడిగా సాగుతున్నాయంటూ ఆలిండియా విద్యార్థి సంఘం సభ్యురాలు షెహ్లా రషీద్ పేర్కొన్నట్లుగా ఉన్న ఓ వీడియా ప్రచారంలో సాగుతోంది. హెహ్లా రషీద్ విద్యార్థులనుద్దేశించి జెఎన్‌యు ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల సంఘటనల గురించి మాట్లాడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లు చేయడం కోసం నమోదు చేసుకున్న విద్యార్థినులను చాలామంది ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, ఎవరైనా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తే, పాలనా యంత్రాంగం సరిగా వినడం లేదు సరికదా, తిరిగి ఆమెనే వేధింపులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. ఈ వేధింపులు ఆపాలంటూ చాలా నిరసన ప్రదర్శనలు సైతం గతంలో జరిగాయని, అయినా ఎలాంటి చర్యా తీసుకోలేదని జెఎన్‌యు విద్యార్థి అయిన ఆమె అన్నారు.

అంతేకాదు జెఎన్‌యు పాలక మండలి ఖాప్ (కుల) పంచాయతీ లాగా ప్రవర్తిస్తోందని కూడా ఆమె ఆరోపించారు.
ఎన్నికల్లో ప్రచారం చేయను: కన్హయ్య
త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేసే అవకాశం లేదని దేశ ద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవలే బెయిలుపై విడుదలైన జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బుధవారం సూచనప్రాయంగా తెలియజేశారు. జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తాను ఇంతకుముందే స్పష్టం చేశానని కన్హయ్య అంటూ, తన స్నేహితులు ఇద్దరు ఇంకా జైల్లోనే ఉన్నారని, రోహిత్ వేముల కేసు మొదలుకొని ఇప్పుడు అలహాబాద్ వర్శిటీ వివాదం దాకా తాము అనేక అంశాలను లేవనెత్తుతామని ఆయన అంటూ, విద్యార్థులకోసం తాను చేయాల్సింది చాలా ఉంది కనుక ఎన్నికల ప్రచారంకోసం ఎక్కువ సమయం కేటాయించే అవకాశం లేదని చెప్పారు.